పుష్ప2 పట్నా ఈవెంట్ కోసం భారీగా ప్రేక్షకులు వచ్చారు. అయితే, ఆ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సిద్ధార్థ్ చేసిన కామెంట్లపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే, తాజాగా తన వ్యాఖ్యలకు సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీలో తనకు ఎవరితోను వ్యక్తిగత సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. సిద్ధార్థ్ కొత్త సినిమా 'మిస్ యూ' ప్రమోషన్స్‌లో భాగంగా పట్నాలో జరిగిన పుష్ప2 ఈవెంట్ కోసం భారీగా బన్నీ ప్యాన్స్ రావడంపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారు. అదంతా సినిమా కోసం చేసిన ఆర్గనైజ్ జనాలు అని అన్నారు. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా జనాలు వెళ్తారని, పట్నా ఈవెంట్‌పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీంతో తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన వ్యతిరేఖత రావడంతో సిద్ధార్థ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 'ఇండస్ట్రీలో నాకు ఎవరితోనూ వ్యక్తిగత సమస్యలు లేవు. అలాంటిది అల్లు అర్జున్‌తో సమస్య ఎందుకు ఉంటుంది. 'పుష్ప2' మంచి విజయం సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. పుష్ప సినిమా హిట్ కావడంతో సీక్వెల్‌గా వచ్చిన పార్ట్2 కోసం భారీగా ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.
సినిమా ఈవెంట్లకు జనాలు ఎక్కువగా వస్తే చాలా మంచిదే అనేది నా అభిప్రాయం. ఈ క్రమంలో థియేటర్‌లకు కూడా జనాలు భారీగా రావాలని ఆశిద్దాం. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలోని నటీనటులుగా మేము అందరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. అయితే, ఇక్కడ 100 సినిమాలు రిలీజ్ అయితే ఒకటి హిట్ అవుతుంది. ఈ క్రమంలో సినీ ఆర్టిస్టులందరికీ వారి కష్టానికి తగిన విధంగా ప్రతిఫలం అందాలి' అని సిద్ధార్థ్ అన్నారు.
'పుష్ప' ఈవెంట్‌పై సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యల వల్లే వివాదం
'పుష్ప 2 కోసం పట్నా ఈవెంట్‌లో 3 నుంచి 4 లక్షల మంది జనం రావడం అనేది ప్రమోషన్స్ జిమ్మిక్ తప్ప మరేమీ కాదు. మన దేశంలో, ఒక JCB తవ్విన స్థలాన్ని కూడా చూసేందుకు ప్రేక్షకులు ఎగపడుతారు. కాబట్టి, బీహార్‌లో అల్లు అర్జున్‌ని చూడటానికి ప్రజలు గుమిగూడడం అనేది పెద్ద విషయమేమి కాదు. వాళ్లు ఆర్గనైజ్ చేస్తేనే జనాలు ఉంటారు. భారతదేశంలో జనాలు వస్తేనే గొప్ప అనుకోవద్దు. అదే నిజమైతే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి. బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ కోసమే ఎక్కువగా వెళ్తారు.' సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment