
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా సత్తా చాటుతున్నాడు. ‘ఆర్య’ సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు.. పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ అని పిలుచుకునే బన్ని మలయాళంలో మల్లు అర్జున్ అయ్యారు. బాలీవుడ్ వాల్లకు పుష్పరాజ్‌గా స్థిరపడిపోయారు. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో అత్యంత శక్తివంతమైన హీరోగా ఆయన టాప్‌లో ఉన్నారు. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని రికార్డ్స్ రప్పా రప్పా అంటూ.. కొట్టేయాలని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అల్లు అర్జున్‌లో ఇవన్నీ ప్రత్యేకమే..
🎥 దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా రికార్డ్

🎥 రెండు సైమా అవార్డులతో పాటు ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్
🎥 'పుష్ప' సినిమాతో తన నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.
🎥 టాలీవుడ్‌లో 'దేశ ముదురు' సినిమాతో సిక్స్‌ప్యాక్ పరిచయం చేసింది అల్లు అర్జున్‌నే
🎥 అల్లు అర్జున్‌కు బాగా నచ్చే సినిమాలు టైటానిక్, ఇంద్ర.. ఇప్పటికే చాలాసార్లు ఆ సినిమాలు చూశారట

🎥 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా పుష్ప: ది రైజ్ రికార్డ్ క్రియేట్ చేసింది.
🎥 2025 పుష్ప2తో తొలిరోజు రూ. 294 కోట్ల వసూళ్లు సాధించిన ఇండియన్ తొలి చిత్రంగా రికార్డ్
🎥 100 ఏళ్ల హిందీ చలన చిత్ర పరిశ్రమ చరిత్రలో రూ. 1000 కోట్లు సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప2 రికార్డ్
🎥 అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ జాబితాలో పుష్ప2కు రెండో స్థానం, ఫస్ట్ దంగల్
🎥 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్‌కు గుర్తింపు
🎥 ప్రముఖ సినిమా మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ కవర్‌పై అల్లు అర్జున్ ఫోటో
🎥 'బద్రినాథ్' సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్న బన్నీ

🎥 'రుద్రమదేవి' సినిమా సమస్యల్లో ఉందని తెలుసుకున్న అర్జున్.. ఆ ప్రాజెక్ట్‌కు తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. అందుకే పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్ర పోషించాడు.
🎥 బన్నీకి నటి ఐశ్వర్యరాయ్ అంటే అభిమానం. ఆవిడకు పెళ్లయినప్పుడు చాలా బాధపడ్డాడట
🎥 ఇన్‌స్టాలో అల్లు అర్జున్ ఫాలోవర్స్ ఏకంగా 28 మిలియన్లు ఉన్నారు. ఇంతమంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ కావడం విశేషం