బన్వర్‌ సింగ్‌ షేకావత్‌ బర్త్‌ డే.. స్పెషల్ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన మేకర్స్! | Pushpa 2 The Rule Special Wishes On Fahadh Faasil Birthday Occassion | Sakshi
Sakshi News home page

Pushpa 2 The Rule: బన్వర్‌ సింగ్‌ షేకావత్‌ బర్త్‌ డే.. పుష్ప టీం స్పెషల్ విషెస్!

Published Thu, Aug 8 2024 4:44 PM | Last Updated on Thu, Aug 8 2024 5:20 PM

Pushpa 2 The Rule Special Wishes On  Fahadh Faasil Birthday Occassion

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ మోస్ట్ ఆవైటేడ్ చిత్రం 'పుష్ప-2 : ది రూల్'. ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. పార్ట్‌-1లో తనదైన నటనతో మెప్పించిన మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇవాళ ఫాహద్ ఫాజిల్‌ బర్త్‌ డే కావడంతో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌ డే విషెస్ తెలిపారు. బన్వర్ ‍సింగ్‌ షేకావత్‌.. ఐపీఎస్‌.. బిగ్‌స్క్రీన్‌పై మరోసారి అభిమానులను అలరించనున్నారంటూ పుష్ప టీమ్ ట్వీట్ చేసింది. పుష్పలో ఐపీఎస్‌ పాత్రలో టాలీవుడ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. పార్ట్‌-2లోనూ ఆయన రోల్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో గన్, గొడ్డలి చేతులతో పట్టుకుని క్రేజీ లుక్‌లో కనిపించారు. కాగా.. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement