టీజర్‌ రెడీ | Pushpa 2 Team Planning To Release Teaser On Allu Arjun Birthday, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Teaser: టీజర్‌ రెడీ

Published Sat, Mar 30 2024 12:25 AM

Pushpa 2 teaser to be released on Allu Arjun birthday - Sakshi

‘పుష్ప : ది రూల్‌’ సినిమా టీజర్‌కు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. హీరో అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఏప్రిల్‌ 8న ‘పుష్ప: ది రూల్‌’ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలిసింది. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫాహద్‌ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.

ఇక ‘పుష్ప’ సినిమా ఫ్రాంచైజీలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ సినిమా సక్సెస్‌ కావడంతో మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు దర్శకుడు త్రివిక్రమ్, మరో దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాలతో అల్లు అర్జున్‌ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల అప్‌డేట్స్‌ కూడా అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఏప్రిల్‌ 8న వచ్చే అవకాశం ఉంది. ఇంకా అల్లు అర్జున్‌–దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లోని కొత్త సినిమా ప్రకటన కూడా రావొచ్చనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement