పుష్ప 2 .. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 21 రోజుల్లోనే రూ.1700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు పాటలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. దెబ్బలు పడ్తయ్‌రో.., పీలింగ్స్.., పుష్ప పుష్ప పాటలు విడుదల చేయగా నాలుగు రోజుల క్రితం 'దమ్ముంటే పట్టుకోరా..' సాంగ్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.
అయితే అదేరోజు పోలీసులు అల్లు అర్జున్‌ను విచారించారు. పోలీసులను ఉద్దేశించే ఈ పాట విడుదల చేశారని పలువురూ భావించారు. ఈ క్రమంలో ఆ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ పాట అలాగే ఉంది. ఇప్పుడేకంగా వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మొదట షెకావత్‌కు సారీ చెప్పిన పుష్పరాజ్.. తర్వాత మాత్రం తనకే సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్.. అంటూ పోలీస్ ముందే తొడ కొట్టాడు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
పుష్ప 2 విషయానికి వస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. ఫహద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా డిసెంబర్ 4న పుష్ప ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
చదవండి: గేమ్ ఛేంజర్.. ఒక్క రోజు షూటింగ్ ఖర్చు అన్ని లక్షలా?
Comments
Please login to add a commentAdd a comment