
సమంత(Samantha) ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఇప్పుడు పూర్తిగా లైమ్ లైట్ లో లేకుండా పోయింది. చెప్పాలంటే గత కొన్నేళ్లలో కొత్త సినిమాలేం చేయలేదు. వెబ్ సిరీసులు చేస్తోందంతే. గతంతో పోలిస్తే సమంత క్రేజ్ కాస్త తగ్గిన మాట వాస్తవమే. కానీ ఈమె దగ్గరకొచ్చిన కోట్ల రూపాయల డీల్స్ ని ఈమె వద్దనుకుందట. స్వయంగా సామ్ ఈ విషయాన్ని బయటపెట్టింది.
'20 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చా. అప్పట్లో సక్సెస్ అంటే ఎన్ని సినిమాలు చేశాం, ఎన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నామనేదే చూసేవాళ్లు. దీంతో అంతర్జాతీయ బ్రాండ్స్ కి ప్రచారకర్తగా చేశా. నాకు చాలా ఆనందంగానూ అనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రమోట్ చేయడంతో పాటు ఎంతో బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నాను'
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే చెట్టాపట్టాల్.. ప్రియురాలితో స్టార్ హీరో)
'ఒకప్పుడు ఇష్టమొచ్చిన బ్రాండ్లకు ప్రమోషన్స్ చేశా. అందుకు ఇప్పుడు నేను సారీ చెబుతున్నాను. కోట్ల రూపాయలు డబ్బు ఇస్తామని చెప్పినప్పటికీ గత ఏడాది కాలంలో 15 బ్రాండ్ల వదులుకున్నాను. ఇప్పటికీ చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ నేను అంగీకరించట్లేదు. నాకు తెలిసిన డాక్టర్స్ ని అడిగి.. సదరు బ్రాండ్లతో ఎలాంటి హాని లేదనిపిస్తేనే ప్రమోట్ చేస్తున్నా' అని సమంత చెప్పుకొచ్చింది.
నెట్ ఫ్లిక్స్ కోసం 'రక్త్ బ్రహ్మాండ్' అనే సిరీస్ చేస్తున్న సమంత.. నిర్మాతగానూ తొలి మూవీ 'శుభం' (Shubham Movie) విడుదలకు సిద్ధం చేసింది.
(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ)