పేర్లు మర్చిపోయా! | I had a concussion on Citadel: Honey set and nobody took me to the hospital: Samantha Ruth Prabhu | Sakshi
Sakshi News home page

పేర్లు మర్చిపోయా!

Published Sat, Oct 19 2024 3:26 AM | Last Updated on Sat, Oct 19 2024 3:27 AM

I had a concussion on Citadel: Honey set and nobody took me to the hospital: Samantha Ruth Prabhu

జోరుగా, జోష్‌గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన సమంత ‘మయోసైటిస్‌’ వ్యాధి కారణంగా ఏడాదికి పైగా షూటింగ్స్‌కి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఈ వ్యాధి వల్ల తాను ఎదుర్కొన్న సమస్యల గురించి పలు సందర్భాల్లో పంచుకున్నారామె. తాజాగా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌ ప్రచార కార్యక్రమాల్లోనూ ఈ వ్యాధి గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో తాను ఒకరోజు జ్ఞాపక శక్తి కోల్పోయానని సమంత చెప్పిన విషయం వైరల్‌గా మారింది. ‘‘సిటాడెల్‌: హనీ బన్నీ’ షూటింగ్‌లో ఉన్నప్పుడు సడన్‌గా అంతా మర్చిపోయా. 

చాలామంది పేర్లు మర్చిపోయాను. ఆ షూటింగ్‌ కోసం ఉపయోగించిన సెట్‌ టైమ్‌ ఇంకా ఒకే ఒక్క రోజు మాత్రమే ఉంది. ఆ పరిస్థితిలో నేను అన్నీ మర్చిపోయాను. ఎవరో మనుషులు వస్తున్నారు... వెళుతున్నారు.. ఓ స్టంట్‌ మాస్టర్‌ నా ముందు ఉన్నాడు... నేనేం చేస్తున్నానో తెలియలేదు. ఇలా అయోమయ స్థితిలో పడిపోయాను. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నా... ఆ టైమ్‌లో నన్నెవరూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని, నా ఆరోగ్యం గురించి ఎవరూ అడగలేదని అనుకుంటుంటాను. కానీ ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ యూనిట్‌ సహకరించింది.

నేను కోలుకున్నాక షూటింగ్‌ చేశారు’’ అని పేర్కొన్నారు సమంత. అయితే సమంత ఇలా మర్చిపోయిన తర్వాత ఈ యూనిట్‌ డాక్టర్‌ని సంప్రదించిందట. ఆ విషయం సమంతకు గుర్తు లేదు. అందుకే ఎవరూ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని ఆమె అనుకుంటున్నారు. ఇక రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ నవంబరు 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement