‘బొమ్మరిల్లు’ సినిమాతో హా హా.. హాసిని అంటూ అందరి మనసులో అలా నిలిచిపోయింది నటి జెనిలియా. ఆ తర్వాత ‘రెడీ’, ‘ఢీ’.. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం పూర్తిగా నటనకు గుడ్‌బై చెప్పి హౌజ్ వైఫ్‌గా మారింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమారులు. అయితే సినిమాలకు దూరమైనప్పటికీ తన వ్యక్తిగత జీవితం, కుటుంబ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను పలకరిస్తూ ఉంటుంది.
చదవండి: ‘సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్’
ఈ నేపథ్యంలో ఇటీవల తన పెద్ద కుమారుడు రియాన్ 7వ పుట్టినరోజు సందర్భంగా, జెనీలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. రియాన్‌పై ప్రేమ కురిపిస్తూ పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలను హద్దుకుంటోంది. దీంతో ఆ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు రియాన్ కోసం ఓ లేఖ రాసుకొచ్చింది జెన్నీ. ‘ప్రియమైన రియాన్! నీ చిట్టి బుర్రలో ఉన్న బోలెడన్ని కోరికలు, ఆశలను కచ్చితంగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా నీకు మాటిస్తున్నా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా.
చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్ ఎంట్రీ..
ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థానంలోనే ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా సరే, నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. అంతే తప్పించి నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్. ఐ లవ్ యూ మై బ్రేవ్ బాయ్’ అంటూ తల్లి ప్రేమను కురిపించింది. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటే తమ అభిమాని హీరోయిన్ జెన్నీ ఇలా ఏమోషనల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జెనిలియా, రితేశ్‌లు తమ కుమారులు ఎప్పుడు సమయంలో కేటాయిస్తుంటారు. ఎక్కడికి వెళ్లిన వారిని వెంట తీసుకుని వారితో సరదాగా గడుపుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment