జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు | Video: Riteish Deshmukh Helps Wife Genelia Tie Up Her Hair | Sakshi
Sakshi News home page

జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు

Published Thu, Mar 18 2021 10:56 AM | Last Updated on Thu, Mar 18 2021 12:28 PM

Video: Riteish Deshmukh Helps Wife Genelia Tie Up Her Hair - Sakshi

ఇటీవల హీరోయిన్‌ జెనీలియా చేతికి స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. దీంతో కొద్ది రోజులుగా ఆమె చేతికి బ్యాండ్‌తోనే కనిపిస్తున్నారు. గాయంతో చేయి పైకి లేపడానికి కూడా కష్టంగా ఉన్న భార్యకు సపర్యలు చేస్తున్నాడు బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌. ఆమె తనంతట తాను జుట్టు వేసుకోవడం కష్టమని అనుకున్నాడో ఏమో కానీ జెనీలియాకు దగ్గరుండి మరీ జుట్టు వేశాడు. శ్రీవారి సేవలకు మురిసిపోయిన ఈ భామ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు సో స్వీట్‌, బెస్ట్‌ కపుల్స్‌ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. 

ఇక ఎప్పుడూ క్రేజీ పనులు చేసే జెనీలియా హీరో రామ్‌తో ఇన్‌స్టా రీల్స్‌ చేయించేందుకు ట్రై చేసింది. అయ్యో అయ్యో అయ్యో దానయ్య అంటూ రామ్‌తో స్టెప్పులు వేయించాలని చూసింది. కానీ రామ్‌ మాత్రం నో అన్నట్లుగా కదలకుండా ఉండిపోవడంతో ఈ రీల్‌ వీడియో ఫన్నీగా మారిపోయింది. దీంతో 'బాబు గారు ఫస్ట్‌ టైమ్‌ రీల్‌ చేస్తున్నారు కదా, సిగ్గు పడుతున్నారు' అంటూ ఈ వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది.

చదవండి: హాలీవుడ్‌కి తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement