ప్రీతితో రితేష్‌.. కోపంగా జెనీలియా.. అసలు నిజం ఇదేనా? | Heres why Genelia looked angry when Riteish kissed Preity Zintas Hands | Sakshi
Sakshi News home page

Genelia DSouza: ప్రీతి చేతిపై రితేష్‌ ముద్దులు.. కోపంగా చూసిన జెనీలియా.. అసలు నిజం ఇదేనా?

Published Fri, Oct 1 2021 1:09 PM | Last Updated on Fri, Oct 1 2021 2:05 PM

Heres why Genelia looked angry when Riteish kissed Preity Zintas Hands - Sakshi

ఐఫా అవార్డ్స్ 2019 సందర్భంగా కలిసిన ప్రీతి జింటా చేతులపై రితేష్ దేశ్‌ముఖ్ ముద్దు పెట్డుకోవడం, ఆ సమయంలో ఆయన భార్య జెనీలియా డిసౌజా కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టడం తెలిసిందే. అనుకోకుండా క్యాప్చర్‌ అయిన ఆ వీడియో చాలాకాలం తర్వాత బయటకి వచ్చి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిపై ఎన్నో మీమ్స్‌, జోకులు హల్‌చల్‌ చేశాయి. తాజాగా అలా కోపంగా ఉండడానికి కారణాన్ని తెలియజేసింది జెనీలియా.

తాజాగా జెనీలియా తన భర్త రితేష్‌తో కలిసి అర్భాజ్‌ఖాన్‌ హోస్ట్‌ చేస్తున్న డిజిటల్‌ షో ‘పించ్‌’ సీజన్‌ 2కి అతిథిగా వచ్చింది. ఆ సమయంలో ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్‌​, మీమ్స్‌ గురించి అడగగా.. ‘చాలా కాలం తర్వాత, నేను ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యాను. కొత్త డ్రెస్‌ వేసుకొని, హై హీల్స్‌ వేసుకొని వెళ్లాను. చాలా రోజుల అనంతరం వేసుకున్న హై హీల్స్‌ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుండగా అలా ఉన్నాను. అలా నేను ఇబ్బంది పడుతుంటే రితేష్‌, ప్రీతి చేతులపై ముద్దు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో క్యామెరాలో బంధించారు. అంతేకానీ మరేం లేదని’ జెన్నీ తెలిపింది.

అయితే ఆ వీడియో వైరల్‌ అయిన తర్వాత ఈ ఫంక్షన్‌ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్‌ చేసింది ఈ నటి. అందులో ఇంటికి రాగానే ఈ భామ.. భర్త రితేష్‌ను కొడుతున్నట్లు, ఆయన వద్దని వేడుకుంటున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీనిపై టైగర్‌ ష్రాప్‌, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందించారు. కాగా వీరిద్దరూ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్‌, రాహిల్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్‌లో దూసుకుపోతున్న‌ స‌మ‌యంలో పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరమైనా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

చదవండి: ‘వల్గర్‌ ఆంటీ’ అంటూ ట్రోలింగ్‌.. జెనీలియా ఘాటు రిప్లై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement