లైఫ్లో గొప్ప నిర్ణయం అదే: రితేశ్
ముంబై: తన భార్య చేయందుకోవడమే జీవితంలో తను చేసిన గొప్ప పని అని బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ పొంగిపోతున్నాడు. వివాహ వార్షికత్సవం సందర్భంగా భార్య జెనీలియా పట్ల తన ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో అభిమానులతో సంతోషాన్ని అతడు పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయం జెనీలియాను ఎంచుకోవడమంటూ మంగళవారం రితేశ్ ట్విట్ చేశాడు.
జీవితభాగస్వామి పట్ల తనకున్న అవ్యాజమైన అనురాగాన్ని ప్రకటించి మరోసారి ఆమె మనసు కొల్లగొట్టేసాడు. అటు అభిమానుల గుండెల్లో హీరోగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. కాగా తుఝె మెరీ కసమ్ సినిమాతో రీల్ లైఫ్ దంపతులుగా వెలిగిన జెనీలియా, రితేశ్ ముఖ్ రియల్ లైఫ్ లోనూ బాలీవుడ్ క్యూట్ కపుల్ గా అవతరించారు. సంతోషకరమైన వీరి వైవాహిక జీవితంలో 2004 లో కొడుకు రియాన్ ఎంటరై మరిన్ని వెలుగులు పూయించాడు. తొందర్లోనే జెనీలియా మరోబిడ్డకు జన్మనివ్వనుంది. పన్నెండేళ్లుగా బాలీవుడ్ లో తమదైన శైలిలో రాణిస్తూ సముచిత స్థానాన్ని సంపాదించుకున్నాడు రితేశ్.