
సాక్షి, ముంబై : బాలీవుడ్ జంట రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. మొక్కల ఆధారిత మాంసాహార సంస్థను ప్రారంభించనున్నారు. ‘ఇమేజిన్ మీట్స్’ పేరుతో ఈ వెంచర్‌ను త్వరలో ప్రారంభించనున్నామని అధికారింగా ఈ జంట ప్రకటించింది. ఇందుకు అమెరికాకు చెందిన గ్లోబల్ సంస్థ ఆర్చర్ డేనియల్స్ మిడ్‌ల్యాండ్ (ఎడిఎమ్) గుడ్ ఫుడ్స్ ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు వివరాలను రితీష్, జెనీలియా ట్విటర్‌లో షేర్ చేశారు.
‘ఇమేజిన్ మీట్స్’ బ్రాండ్ కింద మొక్కల ఆధారంగా రూపొందించే మాంసాహార ఉత్పత్తులను అందించనుంది. ఈ ఉత్పత్తుల వాసన, రుచి నిజమైన మాంసాహారాన్ని పోలి ఉంటాయట. ఈ మొక్కల ఆధారిత ఆహారాలు బఠానీ ప్రోటీన్, కొబ్బరి నూనె వంటి మొక్కల పదార్ధాల నుండి తయారు చేస్తారట. ముఖ్యంగా బిర్యానీ, కబాబ్, కూరలు ఇతర ఉత్పత్తులను రాబోయే నెలల్లో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా దాదాపు మూడేళ్ల క్రితం ఈ జంట పూర్తి శాకాహారిగా మారిన సంగతి తెలిసిందే.
And our journey begins @ImagineMeats @geneliad pic.twitter.com/4nE
— Riteish Deshmukh (@Riteishd) July 21, 2020
Nice to MEAT you .. @ImagineMeats pic.twitter.com/uq8hVI8KoX
— Genelia Deshmukh (@geneliad) July 20, 2020
Comments
Please login to add a commentAdd a comment