సాక్షి, బెంగళూరు: లాక్‌డౌన్ ముగిసిన తరువాత బెంగళూరుకు వచ్చేవారికి కోవిడ్ నెగిటివ్ రిపోర్టును తప్పనిసరి చేయాలని నిపుణులు సూచించారు. ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఆ తరువాత ఎత్తివేస్తే వెంటనే లక్షలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి వలస కూలీలు, ఉద్యోగులు తిరిగివస్తారు. వారు కరోనా నెగిటివ్ రిపోర్టుతో వస్తేనే రాష్ట్రంలోకి అనుమతించాలని పలువురు నిపుణులు పేర్కొన్నారు.
కఠిన లాక్‌డౌన్ వచ్చాక బెంగళూరులో కరోనా కేసులు తగ్గగా, పల్లెల్లో పెరిగాయి. లాక్‌డౌన్ ముగిశాక పల్లెల నుంచి వలసల ప్రవాహం మొదలవుతుంది. దీని వల్ల తిరిగి బెంగళూరులో కరోనా భూతం పంజా విసురుతుందని తెలిపారు. కాబట్టి నెగిటివ్ నివేదికతో రావాలి, లేదా వచ్చినవారందరికీ పరీక్షలు జరిపి కోవిడ్ లేనివారినే అనుమతించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment