
నటుడు శరత్‌కుమార్ ఓ తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఆయనకు నెగిటివ్ రావటంతో డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా శరత్‌కుమార్ కుమార్తె, నటి వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘నాన్నను మరో రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కరోనా అనేది ఎంత ప్రమాదమో కుటుంబంలో ఎవరికైనా పాజిటవ్ అని నిర్ధారణ అయినప్పుడే తెలుస్తుంది. అది ఎంత ఘోరమైన వైరస్సో తెలిసింది. అందుకే కరోనాకి భయపడాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి. మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. తన తండ్రికి వైద్యం చేసిన వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారామె.
Comments
Please login to add a commentAdd a comment