‘‘తిన్న ఆహారాన్ని, పీల్చే గాలిని ఎలా అయితే బయటకు పంపేస్తామో నెగటివిటీని కూడా రెగ్యులర్‌గా మన బాడీలో నుంచి బయటకు పంపేయాలి. లేదంటే సిస్టమ్ దెబ్బతింటుంది’’ అంటున్నారు అమితాబ్ బచ్చన్. నెగటివిటీని దూరం చేయడానికి ఆయన శరీర ప్రక్రియతో పోలుస్తూ ఇలా చెప్పారు– ‘‘మనం తినే ఆహారం జీర్ణం అయిపోయి ఇరవై నాలుగు గంటల్లో బయటకు వెళ్లిపోవాలి. లేదంటే జబ్బుపడతాం. తాగే నీళ్లు నాలుగైదు గంటల్లో బయటకు పంపించేయాలి. లేదంటే జబ్బుపడతాం.
పీల్చే గాలిని కొన్ని నిమిషాల్లోనే బయటకు పంపేయాలి. లేదంటే చనిపోతాం. ఇలా అన్నీ సిస్టమేటిక్‌గా జరుగుతుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మరెందుకు.. నెగటివ్ ఎమోషన్స్ (కోపం, ఇన్‌సెక్యూరిటీ, ఈర్ష్య, ద్వేషం) వంటి వాటిని కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మనలోనే ఉంచేసుకుంటాం?. ఈ నెగటివ్ ఎమోషన్స్‌ని రెగ్యులర్‌గా బయటకు పంపించకపోతే మానసిక జబ్బుకు గురవుతాం. సో.. ఎప్పటికప్పుడు నెగటివ్ ఆలోచనల్ని బయటకు పంపి పాజిటివ్ మైండ్‌తో హ్యాపీగా ఉండండి’’ అని పేర్కొన్నారు అమితాబ్.
Comments
Please login to add a commentAdd a comment