Amitabh Bachchan Tests Positive For Covid-19 Again - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: మళ్లీ కరోనా బారిన అమితాబ్‌, ఆస్పత్రిలో చేరిన బిగ్‌బి..

Aug 24 2022 9:46 AM | Updated on Aug 24 2022 10:57 AM

Amitabh Bachchan Tests Coronavirus Positive - Sakshi

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మళ్లీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేస్తూ.. ఇటీవల తనని కలిసిన వారంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక​ ఆయనకు కరోనా పాజిటివ్‌ అని తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు.

చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్‌ కావాలి: సురేఖ వాణి షాకింగ్‌ కామెంట్స్‌

కాగా బిగ్‌బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆయన రష్మిక మందన్నాతో గుడ్‌బై, ఊంచాయి మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. 2021లో అమితాబ్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌లు కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. 

చదవండి: త్రిష పార్టీకి బలం అవుతుందని నేను అనుకోవడం లేదు: మాజీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement