
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఇదే నెలలో హీరోలు ఆదిత్యారాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే మే 25న దర్శక–నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
ఈ పార్టీ వేదికగానే బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారనే వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. గత నెలలో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారినపడి 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరుకాని విషయం తెలిసిందే.