Birth day party
-
షారుక్‌కి కరోనా
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కాగా ఇదే నెలలో హీరోలు ఆదిత్యారాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. అయితే మే 25న దర్శక–నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే పార్టీకి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ పార్టీ వేదికగానే బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారనే వార్తలు బీటౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. గత నెలలో అక్షయ్ కుమార్ కూడా కరోనా బారినపడి 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు హాజరుకాని విషయం తెలిసిందే. -
దారుణం: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక లైంగిక దాడి
నీముచ్: మహిళా పోలీసులకు కూడా రక్షణ కరువైందని తెలిపే తాజా ఉదాహరణ ఇది. ఓ మహిళా కానిస్టేబుల్(30)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఘటన చోటుచేసుకోగా బాధితురాలు 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలితో నిందితుడు ఏప్రిల్ నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం కొనసాగిస్తున్నాడు. తన సోదరుడి బర్త్‌డే పార్టీకి ఆహ్వానించగా బాధితురాలు వెళ్లింది. అక్కడే ఆమెపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. -
బర్త్ డేకు యువకుడి సర్ప్రైజ్.. నమ్మిన యువతి.. మత్తులో
ముంబై: ప్రస్తుతం యువతీయువకుల మధ్య సరికొత్త బంధాలకు డేటింగ్ యాప్‌లు వేదికవుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం కావడం.. వారితో స్నేహం దారుణ సంఘటనలకు దారి తీస్తోంది. యువతీయువకులతో పాటు గే డేటింగ్ యాప్‌లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను ఉపయోగించుకున్న వారు పలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ యువతిని తన పుట్టినరోజుకు పిలిచి స్టార్ హోటల్లో అత్యాచారం చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన ఓ యువతికి డేటింగ్ యాప్‌లో ఓ యువకుడు నెల కిందట పరిచయమయ్యాడు. అతడితో చాటింగ్ కొనసాగుతోంది. ఇక సోమవారం (జూలై 26వ తేదీ)న ఆమె పుట్టినరోజు ఉండడంతో అతడు ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న వర్లీలోని ఓ స్టార్ హోటల్లో బర్త్ డే ఏర్పాట్లు చేశాడు. నీ కోసం ఈ ఏర్పాట్లు చేశానని చెప్పి ఆమెను హోటల్‌కు ఆహ్వానించాడు. అక్కడకు చేరుకున్న యువతికి అతడు మందు గ్లాస్ ఇచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా మత్తులోకి జారుకుంది. అనంతరం అతడు హోటల్ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తేరుకున్న అనంతరం తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని గుర్తించి షాక్‌కు గురయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శర్వానంద్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో..
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. శనివారం 37వ పుట్టిన రోజు జరుపుకుంటున్న బర్త్ డే బాయ్ శర్వాకి ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బర్త్‌డే సందర్భంగా శర్వానంద్‌కి ఊహించని సర్ప్రైజ్ ఎదురయ్యింది. తన బెస్ట్ ఫ్రెండ్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్‌కు మర్చిపోలేని పుట్టిన రోజు కానుక ఇచ్చారు. అర్థరాత్రి బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసి శర్వానంద్ చేత కేక్ కట్ చేయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో శర్వానంద్.. రామ్ చరణ్, మరో స్నేహితుడితో కలిసి బర్త్ డే కేక్ కట్ చేయడం చూడవచ్చు. ఆచార్య సినిమాకు సంబంధించి తన షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్, రెండు రోజుల క్రితం భార్య ఉపాసనతో కలిసి హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్నేహితుడు శర్వానంద్ కోసం సర్ప్రైజ్ బర్త్ డే పార్టీ అరెంజ్ చేశారు. రామ్ చరణ్, శర్వానంద్‌తో పాటు మరో స్నేహితుడు విక్కి కూడా ఈ బర్త్ డే పార్టీకి హాజరయ్యాడు. Thank you @AlwaysRamCharan for hosting a great party ❤️❤️❤️ pic.twitter.com/jJf03cRMp0 — Sharwanand (@ImSharwanand) March 6, 2021 శ్రీకారం మూవీని పూర్తి చేసిన శర్వానంద్ ప్రస్తుతం తరువాత సముద్రం సినిమాతో బిజీగా ఉన్నాడు.అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్దార్థ్, అను ఇమ్యానుయేల్, అదితి రావ్ హైదరీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం బృందం శర్వానంద్ బర్త్ డే సందర్భంగా మహా సముద్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసింది. పోస్టర్ని బట్టి ఈ సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్లో శర్వానంద్ చేతిలో ఆయుధంతో.. చాలా కోపంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీకారం సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని తెలియజేస్తూ సాగే ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించారు. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. -
బర్త్ డే పార్టీలో లొల్లి: బీజేపీ కార్యకర్త దారుణ హత్య
న్యూఢిల్లీ: జన్మదిన వేడుకలో చిన్నగా మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి ఓ యువకుడి హత్యకు దారి తీసింది. అతడి స్నేహితుడు తన మిత్రులతో కలిసి దారుణంగా హత్య చేశారు. అయితే అతడి హత్య రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు పార్టీలో ఏం జరిగింది? ఎందుకు హత్య చేశారు? మధ్యలో హిందూ సంఘాలు ఎందుకొచ్చాయో చదవండి. న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రింకు శర్మ(25) టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. మంగోల్‌పురిలో అతడు నివసిస్తున్నాడు. స్నేహితుడు డానిశ్‌తో కలిసి గురువారం రింకు రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అయితే పార్టీలో ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం ఏర్పడింది. ఇద్దరు గొడవ పడ్డారు. కోపంలో డానిశ్ పార్టీ అనంతరం ఇంటికి వెళ్తున్న రింకును అడ్డగించారు. డానిశ్ తన ముగ్గురు స్నేహితులను పిలిపించి అడ్డగించాడు. ఈ సమయంలో రింకు, డానిశ్ ఇద్దరు గొడవపడ్డారు. తీవ్ర ఆవేశంలో డానిశ్, అతడి స్నేహితులు రింకు శర్మను కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన రింకు శర్మ సమీపంలోని ఓ ఆస్పత్రికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే కత్తితో తీవ్రంగా పొడవడంతో కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా దీనిపై రాజకీయ దుమారం రేగింది. అతడి హత్యపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. దీనిపై హీరోయిన్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. రింకు శర్మ కుటుంబసభ్యులు దీనిపై స్పందించారు. బీజేపీ యువ మోర్చ, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)లో రింకు క్రియాశీలకంగా ఉన్నాడని తెలిపారు. కొన్నిరోజులుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రింకు విరాళాలు వసూలు చేస్తున్నాడని చెప్పారు. అయితే బర్త్ డే పార్టీలో రింకు జై శ్రీరామ్ నినాదాలు చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ అతడిపై కొంతమంది దాడికి పాల్పడి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఇవే విషయాలు చెబుతున్నారు. అయితే కుటుంబసభ్యులు, వీహెచ్‌పీ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. హత్య జరిగిన విధానం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధాన్షు వివరించారు. రింకు, డానిష్ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గతేడాది హోటల్ వ్యాపారం ప్రారంభించారు. అయితే నష్టాలు రావడంతో కొన్నాళకు మూసేశారు. ఈ విషయమై రింకు, డానిశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై బర్త్ డే పార్టీలో ప్రస్తావన రావడంతో ఇద్దరు గొడవపడ్డారు. ఇదే రింకు హత్యకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. హత్యకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యపై హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. ‘క్షమించు మేం ఓడిపోయాం’ అని సాథ్వి సాచి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. రింకుశర్మకు న్యాయం జరగాలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో కంగనా ట్వీట్ చేసింది. ఆ తండ్రి బాధ చూడండి.. అంటూ రింకుశర్మ మీడియాతో రోదిస్తూ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A peaceful group walks into the house of #RinkuSharma & stabs him to death, his mistake is that he was collecting donations for #RamMandir. Does the lutyen ecosystem has courage to question this lynching? Will the award wapsi group condemn this brutality?#JusticeForRinkuSharma pic.twitter.com/YxsPN4D4Hq — Shobha Karandlaje (@ShobhaBJP) February 12, 2021 Sorry we failed you #JusticeForRinkuSharma https://t.co/H9AQ9xM1E1 — Kangana Ranaut (@KanganaTeam) February 11, 2021 -
బర్త్‌డే పార్టీలో ఓవరాక్షన్ : సింగర్‌పై కాల్పులు
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో బీజేపీ నేత నివాసంలో జరిగిన బర్త్‌డే పార్టీలో కలకలం రేగింది. స్ధానికులు అత్యుత్సాహంతో కాల్పులు జరపడంతో స్టేజ్ సింగర్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. భోజ్‌పురి గాయకుడు గోలు రాజా ఇతర గాయకులతో కలిసి పాటలు పాడుతుండగా ఏడెనిమిది మంది వ్యక్తులు రెండు సార్లు వారిపై గురిపెట్టి కాల్పులు జరిపారు. మహాకల్పూర్ గ్రామంలో జిల్లా బీజేపీ యువమోర్చా నేత భానూ దూబే నివాసంలో జరిగిన తన కుమారుడి బర్త్‌డే పార్టీలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో గోలు రాజా వేదికపై పాడుతుండగా రెండుసార్లు కాల్పులు జరగడంతో ఆయన ఉలిక్కిపడి ఒక్క ఉదుటున వేదిక నుంచి పరుగెత్తే దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఒక బుల్లెట్ రాజా కడుపులోకి, మరో బుల్లెట్ ఆయన చేతిలోకి దూసుకెళ్లిందని బలియా ఎస్పీ దేవేంద్ర నాథ్ వెల్లడించారు. కాల్పుల్లో గాయపడిన గాయకుడిని వారణాసి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, లైసెన్స్డ్ రివాల్వర్ నుంచి రాజాపై కాల్పులు జరిపారని ఎస్పీ తెలిపారు. చదవండి : హథ్రాస్ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం -
పుట్టినరోజు వేడుకల్లో విషాదం
విశాఖపట్నం : జిల్లాలో ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతదేహం స్విమ్మింగ్ పూల్‌లో కనిపించడంతో స్నేహితులే చంపేశారు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక చెందిన సుధాకర్ అనే యువకుడు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సుధాకర్‌కు చెందిన మొత్తం 10 మంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో గాజువాక బీసీ కాలనీకి చెందిన సాయి అనే యువకుడు స్విమ్మింగ్ పూల్ పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పార్టీ అనంతరం స్మిమ్మింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తోటి స్నేహితులు చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదోతరగతి చదువుతున్న ఈ సాయి తల్లిదండ్రులు మరణించడంతో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
భార్య షాలిని బర్త్‌డేకు అజిత్ సర్ప్రైజ్..
చెన్నై : భార్య షాలిని బర్త్‌డే నాడు తమిళ్ స్టార్ హీరో అజిత్ ఆమెకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈనెల 20న షాలిని 40వ ఏట అడుగుపెట్టిన క్రమంలో ఆమె క్లాస్మేట్స్ అందరినీ పార్టీకి రప్పించి భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. స్పెషల్ డేను తల్లితండ్రులు, పిల్లల మధ్య జరుపుకుందామని భార్యకు చెప్పిన అజిత్ ఆమెకు తెలియకుండా ఆమె చిన్ననాటి స్నేహితులందరినీ పార్టీకి ఆహ్వానించారు. ఈ పార్టీకి వేదికగా షాలిని ఎంతో ఇష్టపడే సముద్రానికి అభిముఖంగా ఉన్న ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. వేడుకలకు బుక్ చేసిన హాల్ అంతటినీ షాలిని చిన్ననాటి నుంచి ఇప్పటివరకూ ఎదిగిన తీరును కళ్లకు కట్టేలా బేబీ షాలిని పేరిట ఆమె ఫోటోలతో నింపారు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి తరలిరావడంతో తన భర్త తనను సంతోషంగా ఉంచేందుకు ఇలా ప్లాన్ చేశారని తెలుసుకుని షాలిని మురిసిపోయారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న అజిత్, షాలిని 2000 సంవత్సరంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి కుమార్తె అనౌష్క, కుమారుడు అద్విక్లున్నారు. -
నటి బర్త్ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!
-
నటి బర్త్ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!
ముంబై: బాలీవుడ్ సినీ తారల బర్త్ డే పార్టీ అంటే ఆ జోష్ వేరుగా ఉంటుంది. మరీ అందులో హాట్ భామ మలైకా అరోరా ఉంటే.. ఆ పార్టీలోని హాట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా సినీ, ఫ్యాషన్ క్వీన్ మలైకా అరోరా తన 46వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అక్షయ్‌కుమార్, కరణ్ జోహర్, కరీనా కపూర్, జాన్వీ కపూర్, అనన్య పాండే వంటి బాలీవుడ్ టాప్ స్టార్ పాల్గొన్నారు. మీరు ఊహించింది కరెక్టే.. ఈ బర్త్ డే పార్టీకి మలైక బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బర్త్ డే పార్టీలో తళుక్కున మెరిసిపోయే హాట్ సిల్వర్ ఔట్ఫిట్స్ ధరించి మలైకా అదరగొట్టింది. అంతేకాదు ఈ పార్టీలో ఆమె వేసిన స్టెప్పులు మరింత హైలెట్‌గా నిలిచాయి. అటు ప్రియుడు అర్జున్ కూడా ఈ పార్టీలో తన స్టెప్పులతో రెచ్చిపోయాడు. పార్టీలో ఈ ఇద్దరు చేసిన డ్యాన్సుల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తమమధ్య వయోభేదం ఉన్నా.. మలైకా- అర్జున్ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. తమ రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియాలో అఫీషియల్‌గా ప్రకటించడమే కాదు.. రెగ్యులర్‌గా కలిసి కనిపిస్తూ.. ఈ జోడీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో మలైకా బర్త్‌డే పార్టీలో అర్జున్ సహజంగానే జోష్ మీద కనిపించాడు. పార్టీలో అందరి కళ్లూ ఈ ఇద్దరి మీదే ఉన్నాయంటే అతియోశక్తి కాదు. -
రెట్రో బర్త్‌డే పార్టీ
ప్రతి బర్త్‌డేకి మనం కొంచెం ముందుకెళ్తుంటాం. అంటే వయస్సులో. కానీ ఈ బర్త్‌డేకి రాశీఖన్నా వెనక్కి వెళ్లారు. ఒక సంవత్సరం తగ్గిపోయిందా? అంటే కాదు.. ఏకంగా 20, 30 ఏళ్లు వెనక్కి. ప్రతి బర్త్‌డేని ఒక థీమ్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు రాశీ. ఈ ఏడాది పార్టీ థీమ్ రెట్రో. అంటే పాత కాలంలో ఎలా ఉండేదో అలా అన్నట్టు. పాత క్యాసెట్లు, టెలిఫోన్, టీవీలు డెకరేట్ చేసి పార్టీ చేసుకున్నారామె. గురువారం రాశీ ఖన్నా బర్త్‌డే. ప్రతి సంవత్సరం స్కూల్ ఫ్రెండ్స్ నుంచి, ప్రస్తుతం ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో సహా అందర్నీ ఆహ్వానించి సెలబ్రేట్ చేసుకుంటారు. మొన్న జరిగిన రాశీ బర్త్‌డే పార్టీలో కొన్ని ఫోటోలు. ఈ పార్టీలో రకుల్, మంచు లక్ష్మీ, రామ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, విద్యుల్లేఖా రామన్ తదితరులు పాల్గొన్నారు. -
కత్తులతో ఫోజులిచ్చి కటకటాల్లోకి!
సాక్షి, సిటీబ్యూరో: చట్ట విరుద్దమని తెలిసో తెలియకో వివిధ మార్గాల్లో డాగర్లుగా పిలిచే పదునైన కత్తులను సేకరించారు. వాటితో బర్త్‌డే పార్టీల్లో వాటితో ఫోజులిచ్చారు... ఈ చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు... ఈ విషయం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ వద్దకు చేరడంతో ముగ్గురు యువకులూ ప్రస్తుతం కటకటాల్లోకి వెళ్లారు. ఒకరిని పంజగుట్ట, ఇద్దరిని బోయిన్పల్లి పరిధిల్లో పట్టుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన రాహుల్ ప్రకాష్ ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తుంటాడు. గతేడాది నవంబర్‌లో ఈ–కామర్స్ సైట్ స్నాప్‌డీల్ ద్వారా రూ.999 వెచ్చించి ఓ డాగర్ ఖరీదు చేశాడు. అలాగే కన్స్ట్రక్షన్ రంగంలో పని చేసే న్యూ బోయిన్పల్లి వాసి సాయి యాదవ్, ఓ హోటల్లో పని చేస్తున్న అల్వాల్‌కు చెందిన అర్జున్ దాస్ స్నేహితులు. అర్జున్ దాస్ కొన్నాళ్ళ క్రితం సికింద్రాబాద్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి డాగర్ ఖరీదు చేసి తన వద్ద ఉంచుకున్నాడు. దీనిని ఇటీవల సాయి యాదవ్ తీసుకున్నాడు. ఈ ముగ్గురి వ్యవహారం ఇంత వరకు గుట్టుగానే ఉన్నా... ఇటీవల జరిగిన వేర్వేరు పుట్టిన రోజు పార్టీల్లో పాల్గొన్న రాహుల్, సాయి కత్తులతో ఫోటోలు దిగడంతో పాటు ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో పోస్ట్ చేసుకున్నారు. ఇవి సోషల్‌మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. రాయదుర్గం ఉదంతంతో.. రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల మొదటి వారంలో ఎంగేజ్మెంట్ బారాత్‌లో చేసిన కత్తి విన్యాసం ఓ బాలుడి ప్రాణం తీసింది. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన ఈ ‘కత్తుల సంస్కృతి’ సిటీకి పాకడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వీటి క్రయవిక్రయాలు, వినియోగంపై నిఘా పెంచాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా సోషల్‌మీడియాపై నిఘా ఉంచిన నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టికి రాహుల్, సాయిలు పోస్ట్ చేసిన ఫొటోలు వచ్చాయి. దీంతో ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, కె.శ్రీకాంత్ శుక్రవారం వలపన్ని వీరిద్దరినీ పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న మారణాయుధాలు పరిశీలించగా నిబంధనలకు విరుద్ధమని, అక్రమాయుధాలుగా తేలింది. సాయి విచారణలో అర్జున్ పేరు వెలుగులోకి రావడంతో ముగ్గురినీ అరెస్టు చేశారు. 9 అంగుళాల కంటే ఎక్కువ పొడవు ఉన్న, పదునైన అంచులతో కూడిన కత్తులు తదితరాలు కలిగి ఉండటం ఆయుధ చట్ట ప్రకారం నేరమని డీసీపీ రాధాకిషన్‌రావు స్పష్టం చేస్తున్నారు. వీటిని విక్రయిస్తున్న ఆన్లైన్ సంస్థలు, డెలివరీ చేస్తున్న కొరియర్ సంస్థలకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించామని, వారినీ విచారిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన జాబితాలను సిద్ధం చేస్తున్నారు. -
నారాయణ కాలేజీలో విద్యార్థిపై దాడి
హైదరాబాద్ : నగరంలోని హయత్‌నగర్ నారాయణ కళాశాలలో ఓ విద్యార్థిపై దాడి జరిగింది. విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కళాశాల హాస్టల్లో మద్యం సేవించిన ఆరుగురు విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదారు. ఈ దాడిలో నవీన్(17) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితుని కుటుంబసభ్యులు, బంధవులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అన్యాయంగా తమ కొడుకును కొట్టిన విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
పుట్టినరోజు నాడే..
గుర్గావ్: పుట్టినరోజు వేడుక రోజే ఓ విద్యార్థికి నూరేళ్లు నిండిపోయాయి.నచ్చిన పాటలు ప్లే చేసుకునే విషయలో తలెత్తిన స్వల్ప వివాదం అతని ఉసురు తీసింది. పోలీసు ఉన్నతాధికార హవా సింగ్ అందించిన సమాచారం ప్రకారం బీబీఏ చదుతున్న రోహిత్ తన పుట్టినరోజు సందర్భంగా గుర్గావ్, సుభాష్‌నగర్‌లోని ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా విద్యార్థులు మ్యూజిక్ ప్లే చేస్తూ, డ్యాన్సులు చేస్తూ కోలాహలంగా ఉన్నారు. ఇంతలో కొంతమంది వ్యక్తులు అక్కడికి చేరి తమకిష్టమైన పాటలు ప్లే చేసుకుంటామంటూ గొడవకు దిగారు. దీంతో వివాదం రేగింది. మాటా మాటా పెరిగి ఇక్కడ డాన్స్ చేయడానికి వీల్లేదని, అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటూ వారు ఘర్షణ పడ్డారు. అడ్డొచ్చిన రోహిత్‌పై విచక్షణరహితంగా దాడిచేశారు. ఇనుపరాడ్లు, హాకీ స్టిక్స్ తో విపరీతంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో విద్యార్థులతో పాటు కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విస్తృత అవకాశాలకు.. ఈవెంట్ మేనేజ్మెంట్
నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపోయే విధంగా నిర్వహించాలనుకునే వారికి ఠక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్మెంట్! ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ మార్కెటింగ్-ప్రమోషనింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలను నేటి కార్పొరేట్ యుగానికనుగుణంగా నిర్వహించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దాంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి.. నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది. ప్రవేశం: డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. కోర్సు స్వరూపం: ఈవెంట్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో.. సంబంధిత పరిశ్రమ ఆశిస్తున్న నైపుణ్యాల్లో అభ్యర్థి పరిపూర్ణత సాధించేలా కోర్సు స్వరూపం ఉంటుంది. ఇందుకోసం నాలుగు రకాల లెర్నింగ్ మెథడ్స్‌ను ఉపయోగించి బోధిస్తారు. అవి.. క్లాస్ రూం సెషన్, గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీ, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ. క్లాస్ రూం సెషన్లో.. రెగ్యులర్ లెక్చరర్స్‌తోపాటు ఒక ఈవెంట్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా అభ్యర్థులు రూపొందించాలి. సదరు రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. క్లాస్ రూంలో చర్చించిన అంశాలను మరింత విశ్లేషణతో కూడిన కేస్ స్టడీ రిపోర్ట్‌ను తయారు చేయాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో.. లైవ్ ఈవెంట్స్ నిర్వహణలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఈవెంట్స్-స్పెషలైజేషన్స్: ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే.. స్థూలంగా పబ్లిసిటీ లేదా ఒక సంస్థ /ప్రొడక్ట్/సంబంధిత విభాగానికి బ్రాండింగ్ ఇమేజ్ ఇవ్వడం. కానీ గత కొంత కాలంగా ప్రమెషన్ ఈవెంట్సే కాకుండా మ్యారేజ్ వంటి సోషల్ ఈవెంట్స్ కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి. దీంతో ఔత్సాహికులకు ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. అవకాశాలు: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. దేశంలో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ పరిశ్రమ మల్టీ మిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌసెస్లలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు. ఎంట్రీ లెవల్: ఈ రంగంలో కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు. వేతనాలు: మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఈవెంట్ మేనేజ్మెంట్ అభ్యర్థులకు వేతనాలు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు *15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు *30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అందుకోవచ్చు. కావల్సిన స్కిల్స్: ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో రాణించాలంటే.. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. కోర్సులను ఆఫర్ చేస్తోన్న సంస్థలు ది ఇన్స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. వెబ్సైట్: www.naemd.com ఏపీజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ - న్యూఢిల్లీ. వెబ్సైట్: www.apeejay.edu ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ వెబ్సైట్: www.inlead.in మాస్కో మీడియా-నోయిడా, వెబ్సైట్: ఠీఠీఠీ.ఝ్చటటఛిౌఝ్ఛఛీజ్చీ.ఛిౌఝ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై వెబ్సైట్: www.niemindia.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్మెంట్-చండీగఢ్ వెబ్సైట్: www.itftindia.com అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ -న్యూఢిల్లీ వెబ్సైట్: www.amity.edu/aiem