
చెన్నై : భార్య షాలిని బర్త్‌డే నాడు తమిళ్ స్టార్ హీరో అజిత్ ఆమెకు ప్లెజెంట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈనెల 20న షాలిని 40వ ఏట అడుగుపెట్టిన క్రమంలో ఆమె క్లాస్‌మేట్స్ అందరినీ పార్టీకి రప్పించి భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. స్పెషల్ డేను తల్లితండ్రులు, పిల్లల మధ్య జరుపుకుందామని భార్యకు చెప్పిన అజిత్ ఆమెకు తెలియకుండా ఆమె చిన్ననాటి స్నేహితులందరినీ పార్టీకి ఆహ్వానించారు. ఈ పార్టీకి వేదికగా షాలిని ఎంతో ఇష్టపడే సముద్రానికి అభిముఖంగా ఉన్న ప్రాంగణాన్ని ఎంచుకున్నారు.
వేడుకలకు బుక్ చేసిన హాల్ అంతటినీ షాలిని చిన్ననాటి నుంచి ఇప్పటివరకూ ఎదిగిన తీరును కళ్లకు కట్టేలా బేబీ షాలిని పేరిట ఆమె ఫోటోలతో నింపారు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి తరలిరావడంతో తన భర్త తనను సంతోషంగా ఉంచేందుకు ఇలా ప్లాన్ చేశారని తెలుసుకుని షాలిని మురిసిపోయారు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న అజిత్, షాలిని 2000 సంవత్సరంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారికి కుమార్తె అనౌష్క, కుమారుడు అద్విక్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment