నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు! | Malaika Arora, Arjun Kapoor dances in Birth day Party | Sakshi
Sakshi News home page

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

Published Wed, Oct 23 2019 11:39 AM | Last Updated on Wed, Oct 23 2019 12:06 PM

Malaika Arora, Arjun Kapoor dances in Birth day Party - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సినీ తారల బర్త్‌ డే పార్టీ అంటే ఆ జోష్‌ వేరుగా ఉంటుంది. మరీ అందులో హాట్‌ భామ మలైకా అరోరా ఉంటే.. ఆ పార్టీలోని హాట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తాజాగా సినీ, ఫ్యాషన్‌ క్వీన్‌ మలైకా అరోరా తన 46వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో అక్షయ్‌కుమార్‌, కరణ్‌ జోహర్‌, కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, అనన్య పాండే వంటి బాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ పాల్గొన్నారు. మీరు ఊహించింది కరెక్టే.. ఈ బర్త్‌ డే పార్టీకి మలైక బాయ్‌ఫ్రెండ్‌ అర్జున్‌ కపూర్‌ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

బర్త్‌ డే పార్టీలో తళుక్కున మెరిసిపోయే హాట్‌ సిల్వర్‌ ఔట్‌ఫిట్స్‌ ధరించి మలైకా అదరగొట్టింది. అంతేకాదు ఈ పార్టీలో ఆమె వేసిన స్టెప్పులు మరింత హైలెట్‌గా నిలిచాయి. అటు ప్రియుడు అర్జున్‌ కూడా ఈ పార్టీలో తన స్టెప్పులతో రెచ్చిపోయాడు. పార్టీలో ఈ ఇద్దరు చేసిన డ్యాన్సుల వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తమమధ్య వయోభేదం ఉన్నా.. మలైకా- అర్జున్‌ ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. తమ రిలేషన్‌షిప్‌ గురించి సోషల్‌ మీడియాలో అఫీషియల్‌గా ప్రకటించడమే కాదు.. రెగ్యులర్‌గా కలిసి కనిపిస్తూ.. ఈ జోడీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో మలైకా బర్త్‌డే పార్టీలో అర్జున్‌ సహజంగానే జోష్‌ మీద కనిపించాడు. పార్టీలో అందరి కళ్లూ ఈ ఇద్దరి మీదే ఉన్నాయంటే అతియోశక్తి కాదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement