
ముంబై : బాలీవుడ్ జంట మలైకా అరోరా, అర్జున్ కపూర్‌ల వివాహంపై ఎప్పటి నుంచో ఊహాగానాలు సాగుతున్నా ఇంతవరకూ తమ అనుబంధంపై వారు నోరుమెదపలేదు. వివాహ బంధంతో తమ సాన్నిహిత్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని వీరు నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 19న వీరిద్దరూ చర్చి వెడ్డింగ్‌తో ఒక్కటవుతారని తెలిసింది.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి వివాహం జరుగుతుందని చెబుతున్నారు. అతిధుల జాబితాలో మలైకా సన్నిహితులు కరీనా, కరిష్మా కపూర్‌తో పాటు అర్జున్ కపూర్ క్లోజ్ ఫ్రెండ్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోన్ దంపతులున్నారు. ఏప్రిల్ 19న వివాహం ఖరారవడంతోనే అర్జున్, మలైకాలు ఆ సమయంలో షూటింగ్‌ల హడావిడి లేకుండా ప్లాన్ చేసుకున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment