అర్జున్‌ కపూర్, మలైకా అరోరా పెళ్లి? | Arjun Kapoor and Malaika Arora to tie the knot soon? | Sakshi
Sakshi News home page

అర్జున్‌ కపూర్, మలైకా అరోరా పెళ్లి?

Published Tue, Oct 30 2018 12:34 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Arjun Kapoor and Malaika Arora to tie the knot soon?  - Sakshi

ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్‌లో కోడై కూస్తోంది. నిజానికి ప్రస్తుతం బాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తూ ఉంది. అక్కడి టాప్‌ హీరోయిన్లు ప్రియాంకా చోప్రా, దీపికా పడుకొనె పెళ్లి వార్తలతో బిజీగా ఉన్నారు. వారి సరసన మలైకా అరోరా చేరడం కొంచెం ఆశ్చర్యం కలిగించే సంగతి. కారణం మలైకా వయసు 45. అర్జున్‌ కపూర్‌ వయసు 33. మలైకా గతంలో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అతని వల్ల ఆమెకు 15 ఏళ్ల అర్హాన్‌ ఖాన్‌ అనే కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల నుంచే మలైకా– అర్బాజ్‌ విడిగా ఉంటున్నా గత సంవత్సరమే చట్టబద్ధంగా విడాకులు పొందారు. అయితే ఇద్దరూ ఎవరినీ ఇందుకు నిందించలేదు. కానీ గత కొంతకాలంగా మలైకాతో అర్జున్‌ సన్నిహితంగా మెలుగుతుండటం విడాకులకు ఒక కారణం కావచ్చునని బాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి. మలైకా, అర్జున్‌ కపూర్‌లు కొంతకాలం గుట్టుచప్పుడుగా ఉన్నా ఇటీవల బాహాటంగా కలిసి తిరుగుతున్నారు. మిలాన్‌లో జరిగిన మలైకా పుట్టిన రోజుకు అర్జున్‌ కపూర్‌ ప్రత్యేకంగా హాజరయ్యాడు. ఆ తర్వాత మరో పార్టీకి హాజరయ్యాడు. ఇటీవల ఒక టీవీ షోలో ఆమె చేయి పట్టుకుని అతడు స్టేజ్‌ మీదకు వచ్చి స్టెప్పులేశాడు. ఇవన్నీ చూసి బాలీవుడ్‌లో జనం రేపో మాపో వీరు పెళ్లి చేసుకోబోతున్నారన్న ఊహాగానాలు వ్యాప్తి చేశారు. ‘వాళ్లిద్దరూ ప్రస్తుతానికి మంచి అనుబంధంలో ఉన్నారు. పెళ్లి ప్రస్తావన లేదు’ అని ఇరువురికీ సన్నిహితులైన వారు అంటున్నారు. ‘అర్జున్‌ కపూర్‌ తన చెల్లెలి విషయంలో చాలా ప్రేమగా ఉంటాడు. ఆమె జీవితంలో స్థిరపడ్డాకే తన పెళ్లి గురించి ఆలోచిస్తాడు’ అని మరికొందరు అంటున్నారు.

అర్జున్‌ కపూర్‌ నిర్మాత బోనీ కపూర్‌ కుమారుడన్న సంగతి తెలిసిందే. శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాక బోనీ కపూర్‌ తన మొదటి భార్య కుటుంబంతో లేడు. కానీ శ్రీదేవి మరణం తర్వాత తండ్రీకొడుకుల సాన్నిహిత్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మలైకాతో అతడి స్నేహాన్ని బోనీ కుటుంబం ఎలా చూస్తుందో తెలియదు. ఏమైనా ప్రేమ గుడ్డిది– అది డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌లను పట్టించుకోదు అనే నానుడికి ఈ జంటే ఉదాహరణ. అన్నట్టు గతంలో తన కంటే వయసులో బాగా పెద్దదైన అమృతా సింగ్‌ను సైఫ్‌ అలీ ఖాన్‌ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె అవివాహిత. ఇక్కడ మలైకా డైవోర్సీ. ఆవిధంగా చూసినా ఇది డిఫరెంట్‌ లవ్‌ స్టోరీయే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement