దారుణం: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక లైంగిక దాడి | Woman constable gang-raped in Neemuch Madhya Pradesh | Sakshi
Sakshi News home page

దారుణం: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక లైంగిక దాడి

Published Sun, Sep 26 2021 3:59 AM | Last Updated on Sun, Sep 26 2021 5:11 AM

Woman constable gang-raped in Neemuch Madhya Pradesh - Sakshi

నీముచ్‌: మహిళా పోలీసులకు కూడా రక్షణ కరువైందని తెలిపే తాజా ఉదాహరణ ఇది. ఓ మహిళా కానిస్టేబుల్‌(30)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఘటన చోటుచేసుకోగా బాధితురాలు 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలితో నిందితుడు ఏప్రిల్‌ నుంచి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం కొనసాగిస్తున్నాడు. తన సోదరుడి బర్త్‌డే పార్టీకి ఆహ్వానించగా బాధితురాలు వెళ్లింది. అక్కడే ఆమెపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు.  అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు  ప్రధాన నిందితుడిని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement