Neemuch
-
దారుణం: మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక లైంగిక దాడి
నీముచ్: మహిళా పోలీసులకు కూడా రక్షణ కరువైందని తెలిపే తాజా ఉదాహరణ ఇది. ఓ మహిళా కానిస్టేబుల్(30)పై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడటంతోపాటు ఆ అకృత్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ నెల మొదటి వారంలో ఘటన చోటుచేసుకోగా బాధితురాలు 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలితో నిందితుడు ఏప్రిల్ నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం కొనసాగిస్తున్నాడు. తన సోదరుడి బర్త్‌డే పార్టీకి ఆహ్వానించగా బాధితురాలు వెళ్లింది. అక్కడే ఆమెపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయిదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. -
దొంగతనం ఆరోపణతో ఆదివాసి హత్య
భోపాల్: దొంగతనం అభియోగాలపై ఒక ఆదివాసిని ఎనిమిది మంది తీవ్రంగా హింసించి చంపిన అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో జరిగింది. కన్హయలాల్ భీల్(40)అనే ఆదివాసిని చితార్‌మల్ గుర్జార్ అనే పాల వ్యాపారి బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో గుర్జార్ పాలు నేలపాలయ్యాయి. దీంతో కన్హయలాల్ కావాలనే తన బండికి అడ్డువచ్చాడని ఆరోపిస్తూ తన స్నేహితులను పిలిచి కన్హయపై గుర్జార్ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. కన్హయలాల్‌ను తీవ్రంగా కొట్టి అనంతరం ఒక వాహనం వెనుక తాడుతో కట్టి ఈడ్చుకుపోయారని తెలిపారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో ఉంచడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కన్హయను ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం కన్హయ గాయాల కారణంగా మరణించాడు. ఈ ఘటనపై గుర్జార్‌తో పాటు మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఎస్పీ సూరజ్ కుమార్ తెలిపారు. గుర్జార్‌కు చెందిన మోటార్‌సైకిల్‌ను, కన్హయను కట్టేసిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. -
వేప: అబ్బో చేదు.. కానీ ఈ బుడతడికి కాదు!
సాక్షి, ఊట్కూర్: చిన్నారులకు చాక్లెట్లు.. ఐస్‌క్రీంలు.. బిస్కెట్లు అంటేనే ఎంతో ఇష్టం.. వాటి కోసం అల్లరి చేయడం పరిపాటి. అలాంటిది ఓ బుడతడు మాత్రం మూడు పూటలా పది చొప్పున వేపాకులు తింటూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్‌కు చెందిన ఉమాదేవి, సూరం ప్రకాశ్ దంపతులకు కుమారుడు తనిష్క్ (15 నెలల బాలుడు) ఉన్నాడు. ఆరు నెలలుగా వేపాకును తింటున్నాడు. తండ్రి ఉదయం, సాయంత్రం వేళ వేప కొమ్మతో పళ్లు తోముకుంటూ.. వాటికున్న పూలను చిన్నోడు ముందు వేసేవారు. ఆ చిన్నో డు ఆడుతూ.. పాడుతూ.. ఆ వేప పూలు తినేవాడు.. ప్రస్తుతం ఆకులు తినే అలవాటు చేసుకున్నాడు. రోజూ వేపాకు తింటే ఏమైనా అలర్జీ వచ్చిందా అనుకుంటే పొరపాటే.. అలాంటిదేమీ లేదంటున్నారు తల్లిదండ్రులు.. బిస్కెట్లు, చాక్లెట్లు తిన్నట్లుగా వేపాకును నములుతున్నాడని చెబుతున్నారు. దీనిపై నారాయణపేటలోని డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించగా వేపాకులు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు రావన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో యాంటీబాడీలు పెరుగుతాయన్నారు. చదవండి: కరోనా: వివాహంలో.. మాస్కులే పూల దండలు -
పదేళ్ల బాలుడు పది లక్షలు కొట్టేశాడు
ఇండోర్: అందరూ చూస్తుండగానే పదేళ్ల బాలుడు పది లక్షలు కాజేసిన షాకింగ్ ఘటన మంగళవారం మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. నీమూచ్ జిల్లాలోని జవద్ ప్రాంతంలో ఓ కార్పొరేటివ్ బ్యాంకు ఉంది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ బ్యాంకులోకి అందరూ కస్టమర్లతోపాటు ఓ బాలుడు ప్రవేశించాడు. అయితే రాగానే నెమ్మదిగా వెళ్లి క్యాషియర్ క్యాబిన్లోకి దూరి ఓ మూలకు నక్కాడు. ఎదురుగా బారెడంత క్యూ ఉన్నా వారెవరికీ ఈ బక్కపలుచని బుడ్డోడు కనిపించలేదు. పైగా అక్కడ క్యాబిన్లో సదరు ఉద్యోగి లేకపోవడంతో దొరికిందే చాన్సని అక్కడున్న 500 నోట్ల కట్టలను దొరికిన కాడికి అందుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి క్షణమాలస్యం చేయకుండా ఉడాయించాడు. (కరోనా : భార్య శాంపిల్స్ పనిమనిషి పేరుతో.. ) ఈ చోరీ అంతా కేవలం ముప్పై సెకన్లలోనే పూర్తి చేసేయడం విశేషం. అయితే ఆ పిల్లవాడు బ్యాంకు నుంచి అడుగు బయటపెట్టే ముందు అలారమ్ మోగింది. దీంతో అప్రమత్తమైన బ్యాంకు గార్డు అతని వెనకాలే పరిగెత్తాడు, కానీ అప్పటికే ఆ బుడ్డోడు జారుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమివ్వగా వారు బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో ఆ పిల్లవాడికి బ్యాంకులో ఉన్న మరో వ్యక్తి సహకరించినట్లు స్పష్టమైంది. ఈ ఘటనపై జవద్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఓపీ మిశ్రా మాట్లాడుతూ.. "మైనర్ బాలుడుతోపాటు, అతనికి సహకరించిన వ్యక్తి వేర్వేరు దారుల్లో పరిగెత్తారు. ఆ ప్రాంతంలో రోడ్ల పక్కన ఉండే దుకాణాదారులను దీని గురించి ప్రశ్నిస్తున్నాం. సెక్యూరిటీ గార్డును సైతం విచారిస్తున్నాం" అని తెలిపారు. (ఆన్లైన్ క్లాసులని ఫోన్ ఇస్తే ఏకంగా..) -
దారుణం : తాగి వచ్చి సొంత కూతురుపైనే..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో శనివారం దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కన్న కూతురు మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. నీముచ్‌కు చెందిన ఒక వ్యక్తి తన 8 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తు తెలియని వ్యక్తి చైల్డ్ హెల్ప్‌లైన్ సర్వీస్‌కు ఫోన్ చేసి సమాచారమందించినట్లు పోలీసులు వెల్లడించారు. 'అతను నిత్యం తాగి వచ్చి తన కూతురును చితకబాదేవాడు. శనివారం కూడా తాగి వచ్చి కూతురుపై అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. మేము అక్కడికి వెళ్లేసరికి ఇంట్లో పాప ఒక్కతే ఉందని' జిల్లా ఎస్పీ రాకేష్ మోహన్ శుక్లా పేర్కొన్నారు. వెంటనే బాధితురాలిని మెడికల్ పరీక్ష నిర్వహణకు ఆసుపత్రికి తరలించగా సదరు బాలిక లైంగిక దాడికి గురైనట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన ఆమె తండ్రిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సత్వర విచారణ జరిపేందుకు జిల్లా సెషన్స్ జడ్జి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
స్టేషన్లోనే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న కానిస్టేబుల్
నీమచ్: డ్యూటీలో ఉన్న సమయంలోనే ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వార్ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని రత్నఘర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. రత్నఘర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న జగదీశ్ కటారా(22) మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత స్టేషన్ ప్రాంగణంలోనే ఛాతికి తుపాకి గురిపెట్టుకుని కాల్చుకున్నాడు. రక్తస్త్రావం అవుతుండగా సహచరులు జగదీశ్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబకలహాల కారణంగానే జగదీశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు. -
అసభ్య ప్రవర్తనతో తన్నులు తిన్నాడు
నీముచ్: మధ్యప్రదేశ్ లోని నీముచ్ ప్రాంతంలో జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారుణం బయటకు వెల్లడైంది. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కామాంధుడికి స్థానికులు దేహశుద్ధి చేసినప్పుడు తీసిన వీడియో ఇది. వావివరసలు మర్చిపోయి సోదరిపై లైంగిక దాడికి యత్నించడంతో అతడిని చితక్కొట్టారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. తనను బలవంతంగా లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడని బాధితులు తెలిపింది. తన తల్లిదండ్రులు వారించినా వినకుండా తనను ఎత్తుకుపోయాడని వాపోయింది. స్థానికుల సహకారంతో అతడి బారి నుంచి తప్పించుకున్నానని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.