విస్తృత అవకాశాలకు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ | Event management career will make more opportunities | Sakshi
Sakshi News home page

విస్తృత అవకాశాలకు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్

Published Wed, Oct 29 2014 1:10 AM | Last Updated on Sat, Sep 22 2018 8:06 PM

విస్తృత అవకాశాలకు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ - Sakshi

విస్తృత అవకాశాలకు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్

నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపోయే విధంగా నిర్వహించాలనుకునే వారికి ఠక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్‌మెంట్! ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ మార్కెటింగ్-ప్రమోషనింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలను నేటి కార్పొరేట్ యుగానికనుగుణంగా నిర్వహించడానికి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దాంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి.. నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది.  
 
 ప్రవేశం: డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్‌పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి.
 
 కోర్సు స్వరూపం: ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌లో.. సంబంధిత పరిశ్రమ ఆశిస్తున్న  నైపుణ్యాల్లో అభ్యర్థి పరిపూర్ణత సాధించేలా కోర్సు స్వరూపం ఉంటుంది. ఇందుకోసం నాలుగు రకాల లెర్నింగ్ మెథడ్స్‌ను ఉపయోగించి బోధిస్తారు. అవి.. క్లాస్ రూం సెషన్, గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీ, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ. క్లాస్ రూం సెషన్‌లో.. రెగ్యులర్ లెక్చరర్స్‌తోపాటు ఒక ఈవెంట్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా అభ్యర్థులు రూపొందించాలి. సదరు రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. క్లాస్ రూంలో చర్చించిన అంశాలను మరింత విశ్లేషణతో కూడిన కేస్ స్టడీ రిపోర్ట్‌ను తయారు చేయాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో.. లైవ్ ఈవెంట్స్ నిర్వహణలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు.
 
 ఈవెంట్స్-స్పెషలైజేషన్స్: ఈవెంట్ మేనేజ్‌మెంట్ అంటే.. స్థూలంగా పబ్లిసిటీ లేదా ఒక సంస్థ /ప్రొడక్ట్/సంబంధిత విభాగానికి బ్రాండింగ్ ఇమేజ్ ఇవ్వడం. కానీ గత కొంత కాలంగా ప్రమెషన్ ఈవెంట్సే కాకుండా మ్యారేజ్ వంటి సోషల్ ఈవెంట్స్ కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి. దీంతో ఔత్సాహికులకు ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి.
 
 అవకాశాలు: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. దేశంలో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమ మల్టీ మిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌసెస్‌లలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు.
 
 ఎంట్రీ లెవల్: ఈ రంగంలో కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు.
 
 వేతనాలు:  మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులకు వేతనాలు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు *15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు *30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అందుకోవచ్చు.
 
 కావల్సిన స్కిల్స్: ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో రాణించాలంటే..  సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి.  
 
 కోర్సులను ఆఫర్ చేస్తోన్న సంస్థలు
  ది ఇన్‌స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్. వెబ్‌సైట్: www.naemd.com
  ఏపీజే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ - న్యూఢిల్లీ.
     వెబ్‌సైట్: www.apeejay.edu  
  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్
     వెబ్‌సైట్: www.inlead.in
  మాస్‌కో మీడియా-నోయిడా, వెబ్‌సైట్: ఠీఠీఠీ.ఝ్చటటఛిౌఝ్ఛఛీజ్చీ.ఛిౌఝ
  నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్-ముంబై
     వెబ్‌సైట్: www.niemindia.com
  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్‌మెంట్-చండీగఢ్
     వెబ్‌సైట్: www.itftindia.com
  అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ -న్యూఢిల్లీ
     వెబ్‌సైట్: www.amity.edu/aiem

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement