event management courses
-
విస్తృత అవకాశాలకు.. ఈవెంట్ మేనేజ్మెంట్
నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ ఫంక్షన్ వరకు అదిరిపోయే విధంగా నిర్వహించాలనుకునే వారికి ఠక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్మెంట్! ఎడ్యుకేషన్ ఈవెంట్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ వరకు.. కార్పొరేట్ నుంచి ప్రొడక్ట్ మార్కెటింగ్-ప్రమోషనింగ్, సెమినార్లు, వర్క్‌షాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాలను నేటి కార్పొరేట్ యుగానికనుగుణంగా నిర్వహించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. దాంతో సంబంధిత రంగంలో కోర్సు పూర్తి చేసిన వారికి.. నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది. ప్రవేశం: డిప్లొమాకు 10+2 లేదా ఇంటర్మీడియెట్పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుకు మాత్రం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి. కోర్సు స్వరూపం: ఈవెంట్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌లో.. సంబంధిత పరిశ్రమ ఆశిస్తున్న నైపుణ్యాల్లో అభ్యర్థి పరిపూర్ణత సాధించేలా కోర్సు స్వరూపం ఉంటుంది. ఇందుకోసం నాలుగు రకాల లెర్నింగ్ మెథడ్స్‌ను ఉపయోగించి బోధిస్తారు. అవి.. క్లాస్ రూం సెషన్, గెస్ట్ లెక్చరర్స్-కేస్ స్టడీ, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇన్నోవేటివ్-ఇంటరాక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ. క్లాస్ రూం సెషన్లో.. రెగ్యులర్ లెక్చరర్స్‌తోపాటు ఒక ఈవెంట్‌కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను కూడా అభ్యర్థులు రూపొందించాలి. సదరు రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మార్పులపై అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. క్లాస్ రూంలో చర్చించిన అంశాలను మరింత విశ్లేషణతో కూడిన కేస్ స్టడీ రిపోర్ట్‌ను తయారు చేయాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో.. లైవ్ ఈవెంట్స్ నిర్వహణలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు. ఈవెంట్స్-స్పెషలైజేషన్స్: ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే.. స్థూలంగా పబ్లిసిటీ లేదా ఒక సంస్థ /ప్రొడక్ట్/సంబంధిత విభాగానికి బ్రాండింగ్ ఇమేజ్ ఇవ్వడం. కానీ గత కొంత కాలంగా ప్రమెషన్ ఈవెంట్సే కాకుండా మ్యారేజ్ వంటి సోషల్ ఈవెంట్స్ కూడా ఇందులో చోటు సంపాదించుకున్నాయి. దీంతో ఔత్సాహికులకు ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. అవకాశాలు: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. దేశంలో హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ పరిశ్రమ మల్టీ మిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈ రంగంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు, కార్పొరేట్ హౌసెస్, స్టార్ హోటల్స్, రేడియో స్టేషన్స్, రిసార్ట్స్, క్లబ్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ రిలేషన్ ఏజెన్సీలు, మీడియా హౌసెస్, మూవీ/టీవీ ప్రొడక్షన్ హౌసెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు, మ్యూజిక్ పరిశ్రమ, స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఫ్యాషన్ హౌసెస్లలో వివిధ హోదాల్లో అవకాశాలు ఉంటాయి. అనుభవం ఆధారంగా సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా స్థాపించుకోవచ్చు. ఎంట్రీ లెవల్: ఈ రంగంలో కెరీర్ ప్రారంభంలో.. జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేయాలి. తర్వాత స్కిల్స్, అనుభవం ఆధారంగా సీనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కో-ఆర్డినేటర్, ఈవెంట్ అసిస్టెంట్ వంటి వివిధ హోదాల్లో స్థిర పడొచ్చు. ఈ హోదాల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ రంగంలో ఉన్నత స్థానమైన.. ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి కూడా చేరుకొవచ్చు. వేతనాలు: మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లతో పోల్చితే.. ఈవెంట్ మేనేజ్మెంట్ అభ్యర్థులకు వేతనాలు ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రారంభంలో జూనియర్ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్‌కు నెలకు *15-20 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత ప్రతిభ, అనుభవం, హోదాను బట్టి నెలకు దాదాపు *30-50 వేల వరకు సంపాదించవచ్చు. ఈవెంట్ మేనేజర్/ఈవెంట్ డెరైక్టర్ స్థాయికి చేరుకుంటే నెలకు దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అందుకోవచ్చు. కావల్సిన స్కిల్స్: ఈవెంట్ మేనేజ్మెంట్ రంగంలో రాణించాలంటే.. సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం, సమయస్ఫూర్తి అవసరం. ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. కోర్సులను ఆఫర్ చేస్తోన్న సంస్థలు ది ఇన్స్టిట్యూట్ నేషనల్ అకాడెమీ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. వెబ్సైట్: www.naemd.com ఏపీజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ - న్యూఢిల్లీ. వెబ్సైట్: www.apeejay.edu ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ వెబ్సైట్: www.inlead.in మాస్కో మీడియా-నోయిడా, వెబ్సైట్: ఠీఠీఠీ.ఝ్చటటఛిౌఝ్ఛఛీజ్చీ.ఛిౌఝ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై వెబ్సైట్: www.niemindia.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ఫ్యూచర్ మేనేజ్మెంట్-చండీగఢ్ వెబ్సైట్: www.itftindia.com అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ -న్యూఢిల్లీ వెబ్సైట్: www.amity.edu/aiem -
పెళ్లి చేసి అత్తారింటికి పంపే.. వెడ్డింగ్ ప్లానర్
అప్‌కమింగ్ కెరీర్: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితాల్లో మరచిపోలేని మధురమైన ఘట్టం. ఇద్దరి మనసులను, రెండు కుటుంబాలను ఒక్కటి చేసే వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తుంటారు. ఆధునిక జీవితాలు తీరికలేకుండా బిజీబిజీగా మారిపోయా యి. పెళ్లి వేడుకల కోసం ఎక్కువ సమయం వెచ్చించలేని పరిస్థితి. మారుతున్న కాలానికి తగ్గట్టు వెడ్డింగ్ ప్లానర్లు పుట్టుకొచ్చారు. సంతృప్తికి, ప్రశంసలకు, ఆదాయానికి లోటులేని కెరీర్.. వెడ్డింగ్ ప్లానింగ్. నేటి కార్పొరేట్ యుగంలో వెడ్డింగ్ ప్లానర్లకు డిమాండ్ పెరిగింది. వీరికి మనదేశంతోపాటు విదేశాల్లోనూ ఎన్నో అవకాశాలున్నాయి. ప్రారం భంలో ఏదైనా వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థలో పనిచేసి తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. వివాహాల నిర్వాహకులు ఎన్నో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. క్లయింట్ల అభిరుచులు, అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వివాహ వేడుక జరిపించాలి. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి, పెళ్లి జరిగి, అప్పగింతలయ్యేదాకా అన్ని దశలు విజయవంతంగా పూర్తయ్యేలా స్వయంగా పర్యవేక్షించాలి. వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అధిక శ్రమతో కూడుకున్న వృత్తి. ఇందులో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. ముందే నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు జరిగేలా చూసుకోవాలి. టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అర్హతలు: వెడ్డింగ్ ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే ప్రత్యేకంగా విద్యార్హతలు లేవు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు ఈ రంగంలో నిలదొక్కుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు చదవాలి. ఈ కోర్సుల్లో భాగంగా వెడ్డింగ్ ప్లానింగ్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ రంగానికి సంబంధించి ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా వెడ్డింగ్ ప్లానర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారెందరో ఉన్నారు. వేతనాలు: వెడ్డింగ్ ప్లానింగ్ అనేది అనేక విభాగాల కలబోత. సాధారణంగా కో-ఆర్డినేటర్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వరకు వేతనం లభిస్తుంది. మూడేళ్లపాటు పనిచేసి అనుభవం సంపాదిస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు అందుకోవచ్చు. ఆపరేషన్స్ మేనేజర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం ఉంటుంది. తర్వాత అనుభవం, పనితీరును బట్టి నెలకు లక్ష రూపాయల దాకా పొందొచ్చు. ఇక సొంత సంస్థను ఏర్పాటు చేసుకున్న వెడ్డింగ్ ప్లానర్ వివాహాల సీజన్లో లక్షలాది రూపాయల ఆదాయం ఆర్జించొచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై వెబ్సైట్: www.niemindia.com - తానియా-తాపెల్ వెడ్డింగ్ ప్లానర్ ట్రైనింగ్ అకాడమీ-ముంబై వెబ్సైట్: www.tania-tapel.com - ఈవెంట్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్-ముంబై వెబ్సైట్: www.emdiworld.com ఓర్పు, మాటతీరే.. పెట్టుబడి శ్రీ వివాహ మహోత్సవ వేడుక అత్యంత ప్రధానమైంది. ఎక్కడో దూరంగా ఉన్న ఆత్మీయులు పెళ్లి కార్యక్రమానికి తోడ్పాటును అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. అన్ని పనులను ఒక్కరే చేసుకోలేరు. కాబట్టి వెడ్డింగ్ ప్లానర్లపై ఆధారపడుతున్నారు. అందమైన వేడుకను ఆహ్లాదభరితంగా నిర్వహించే వెడ్డింగ్ ప్లానర్లకు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. శ్రమ ఎక్కువైనా ఓర్పు వహించడం, అతిథులను ఆత్మీయంగా పలకరించడం వంటి లక్షణాలుంటే ఈ రంగంలో రాణించొచ్చు. విద్యార్ధులు, నిరుద్యోగులకు ఇది ఆర్థికంగా వెసులుబాటును ఇచ్చే కెరీర్. వెడ్డింగ్ ప్లానింగ్ రంగంలో అనుభవాన్ని బట్టి భారీ వేతనాలుంటాయి - అజ్మత్, ఈవెంట్ మేనేజర్ -
ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుల వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ పీఎంఆర్‌డీఎఫ్ ఫెలోషిప్ వివరాలు తెలియజేయండి? - సుశాంత్, షాద్‌నగర్. పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంవోఆర్డీ) ప్రారంభించిన కార్యక్రమమే పీఎంఆర్‌డీఎఫ్ (ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి ఫెలోషిప్స్). ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ఫెలోషిప్స్‌ను నిర్వహిస్తోంది. ఈ ఫెలోషిప్స్నకు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వ పథకాల అమలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై వెనుకబడిన జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) నుంచి ఎంఎస్సీ/ఎంఫిల్ (డెవలప్మెంట్ ప్రాక్టీస్) కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం పూర్తిగా నిర్దేశించిన రాష్ట్రంలో ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సమయంలో వీరికి స్టేట్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్‌లో పూర్తిస్థాయి ఉద్యోగికి ఇచ్చే వేతనంతో సమానమైన జీతాన్ని అందజేస్తారు. వీరు ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఎన్ఆర్ఎల్ఎం, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్, ఎన్బీఏ, ఎన్ఎస్ఏపీ, ఐఏపీ, ఐసీడీఎస్, ఎన్ఆర్హెచ్ఎం వంటి గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి తగిన సూచనలు ఇస్తారు. ఎంపిక విధానంలో మూడు దశలు ఉంటాయి. అవి.. ఆలిండియా కాంపిటెన్సీ అసెస్మెంట్ టెస్ట్ (ఏఐసీఏటీ), రిటెన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ మూడు దశలకు కలిపి 200 మార్కులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 75 వేల ఫెలోషిప్ లభిస్తుంది. రెండో సంవత్సరంలో ఫెలోషిప్ మొత్తంలో 10 శాతం పెరుగుతుంది. ఓరియంటేషన్ సమయంలో నెలకు రూ.50 వేల స్టైపెండ్ ఇస్తారు. విద్యార్హత: 50 శాతం మార్కులతో నాలుగేళ్ల వ్యవధి ఉన్న గ్రాడ్యుయేషన్ (అగ్రికల్చర్/ఇంజనీరింగ్/లా/మెడిసిన్/ యానిమల్ హజ్బెండరీ తదితర) లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్. స్థానిక భాషపై పట్టు, సంబంధిత రంగంలో అనుభవం, కాలేజీ/పాఠశాల స్థాయిలో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు: 22-27 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీ- 32 ఏళ్లు). వెబ్సైట్: pmrdfs.tiss.edu ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు వివరాలు తెలపండి? - వెంకట్, జడ్చర్ల. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాస్పిటాలిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగం హవా నడుస్తోంది. మన దేశంలో పరిస్థితులు కూడా దీనికి భిన్నంగా లేవు. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. విజ్‌క్రాఫ్ట్ వంటి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, వివిధ టీవీ చానళ్లలో ఈవెంట్ మేనేజర్‌గా, లాక్మే వంటి సంస్థలు నిర్వహించే ఫ్యాషన్‌షోలకు కో-ఆర్డినేటర్లుగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఫిల్మ్‌ఫేర్ వంటి వివిధ మీడియా హౌస్‌లు, టూరిజం, అడ్వర్టైజ్మెంట్ హౌస్‌ల్లో కూడా స్థిరపడొచ్చు. విదేశాల్లోనూ, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్ఏ నెట్వర్క్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. ఈ రంగంలో రాణించాలంటే కొన్ని ప్రత్యేక స్కిల్స్ తప్పనిసరి. విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో సంప్రదింపులు, చర్చలు సాగించాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై మంచి పట్టు ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు నాయకత్వ లక్షణాలు తప్పనిసరి. అందిస్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్- ముంబై. వెబ్సైట్: www.niemindia.com ఈఎండీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్- హైదరాబాద్. వెబ్సైట్: www.emdiworld.com అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ (అమిటీ యూనివర్సిటీ)- న్యూఢిల్లీ. వెబ్సైట్: www.amity.edu/aiem అపేజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్- ద్వారక. వెబ్సైట్: www.apeejay.edu హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్సు వివరాలు తెలియజేయగలరు? - సంతోష్, నల్లగొండ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హ్యూమన్ రిసోర్స్ సబ్జెక్టుకు సంబంధించి డిప్లొమా నుంచి పీజీ స్థాయి వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో హెచ్ఆర్ను ఓ స్పెషలైజేషన్‌గా దాదాపు అన్ని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు అంది స్తున్నాయి. ఇంకా... రెండేళ్ల వ్యవధితో పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంఏ- హెచ్ఆర్ఎం/ ఐఆర్‌పీఎం కోర్సులు కూడా చదవొచ్చు. ఎంఏ.. ఎంబీఏ.. పీజీ డిప్లొమా.. కోర్సు ఏదైనా హెచ్ఆర్కు సంబంధించి బోధనాంశాలు ఒకే తీరుగా ఉంటాయి. మానవ వనరులు, మేనేజ్మెంట్కు సంబంధించిన అంశాలతో కరిక్యులం రూపొందిస్తున్నారు. ఉత్పత్తి రంగమైనా, సేవా రంగమైనా చిన్న తరహా సంస్థ అయినా, బహుళజాతి కంపెనీ అయినా హెచ్ఆర్ సిబ్బంది కావాల్సిందే. కాబట్టి సంబంధిత కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. హెచ్ఆర్ స్పెషలైజేషన్‌ను ఆఫర్ చేస్తున్న కొన్ని ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్:www.uohyd.ernet.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్- హైదరాబాద్ వెబ్సైట్: www.ipeindia.org ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం వెబ్సైట్: www.andhraunivercity.edu.in కాకతీయ యూనివర్సిటీ- వరంగల్ వెబ్సైట్: www.kakatiya.ac.in -
ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సులు...?
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించి కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లను తెలపండి? -భార్గవి, మిర్యాలగూడ. ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ దిశగా ఎన్నో విధానాలను రూపొందించింది. సాంకేతిక అంశాలు, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడి, సంబంధిత అంశాల్లో ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు కూడా కావల్సిన సహాయాన్ని అందిస్తున్నాయి. కాబట్టి ముందుగా ఆయా అంశాలపై అవగాహన పొందడం అవసరం. తద్వారా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా-అహ్మదాబాద్ కోర్సు: పీజీ డిప్లొమా (మేనేజ్మెంట్-బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ప్రవేశం: క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా వివరాలకు: www.ediindia.org సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్- హైదరాబాద్ వివరాలకు: www.cedhyderabad.org ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (దూర విద్యా విధానంలో)-న్యూఢిల్లీ వివరాలకు: www.ignou.ac.in వెటర్నరీ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -శర ణ్, కూకట్పల్లి. వ్యవసాయానుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో వెటర్నరీ సైన్స్.. సంబంధిత కోర్సులను అభ్యసించిన వారికి డిమాండ్ భారీగా ఉంటోంది. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరికి పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జులాజికల్ పార్క్స్, ఇన్సూరెన్స్ సంస్థల్లో, ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. ఇటీవల కాలంలో.. జంతు సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో.. సొంత క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సంబంధిత పరిశోధనా సంస్థల్లో సైంటిస్ట్‌గా చేరొచ్చు. టీచింగ్ ప్రొఫెషన్ కూడా ఎంచుకోవచ్చు. వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ)గా పేర్కొంటారు. ఈ కోర్సు తర్వాత పీజీ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్)గా వ్యవహరిస్తారు. మన రాష్ట్రంలో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). జాతీయ స్థాయిలో.. జాతీయ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ (ఏఐపీవీటీ) టెస్ట్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రస్థాయి వెటర్నరీ (జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వివరాలకు:www.vci.nic.in ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి? -కీర్తి, అమలాపురం. నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ వరకు టక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్మెంట్.. ప్రొడక్ట్ లాంచింగ్ నుంచి కార్పొరేట్ కాన్ఫరెన్స్‌లు, సెమినార్లు, వర్కషాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాల నిర్వహణకు ఈవెంట్ మేనేజర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ.. ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి విజ్‌క్రాఫ్ట్ వంటి ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, వివిధ టీవీ చానెల్స్‌లో ఈవెంట్ మేనేజర్‌గా, లాక్మే వంటి సంస్థలు నిర్వహించే ఫ్యాషన్‌షో కో-ఆర్డినేటర్లుగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఫిల్మ్‌ఫేర్ వంటి వివిధ మీడియా హౌస్‌లు, టూరిజం, అడ్వర్టైజ్మెంట్ హౌస్‌ల్లో కూడా స్థిరపడొచ్చు. విదేశాల్లోనూ, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్ఏ నెట్వర్క్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. ఆఫర్ చేస్త్తున్న సంస్థలు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్-ముంబై కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.niemindia.com ఈఎండీఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్- హైదరాబాద్ కోర్సు: పీజీ డిప్లొమా/డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వెబ్సైట్: www.emdiworld.com అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ (అమిటీ యూనివర్సిటీ)-న్యూఢిల్లీ వెబ్సైట్: www.amity.edu/aiem ఫిషరీస్ సెన్సైస్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -భాస్కర్, బాపట్ల. ఓషియానోగ్రఫీ, మెరైన్ బయాలజీ, ఎకాలజీ, పాపులేషన్ డైనమిక్స్ వంటి అంశాలను అధ్యయనం చేసే ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్.. ఫిషరీస్ సైన్స్. ఈ విభాగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు ఫిష్ ఫార్మింగ్ యూనిట్స్, ఫిష్ ప్రాసెసింగ్ కంపెనీ వంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటాయి. ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు: శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి, ఫిషరీస్‌కు సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ కోర్సులను అందిస్తుంది. వివరాలకు: http://svvu.edu.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఎంఎస్సీ (మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్) సైన్స్ కోర్సును అందిస్తుంది. వివరాలకు: www.andhrauniversity.edu.in