ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు...? | courses in event management | Sakshi
Sakshi News home page

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు...?

Published Thu, Oct 10 2013 4:05 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు...? - Sakshi

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సులు...?

టి. మురళీధరన్
 టి.ఎం.ఐ. నెట్‌వర్క్
 
బీటెక్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌నకు సంబంధించి కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్లను తెలపండి?
 -భార్గవి, మిర్యాలగూడ.
 
 ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ దిశగా ఎన్నో విధానాలను రూపొందించింది. సాంకేతిక అంశాలు, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడి, సంబంధిత అంశాల్లో ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు కూడా కావల్సిన సహాయాన్ని అందిస్తున్నాయి. కాబట్టి ముందుగా ఆయా అంశాలపై అవగాహన పొందడం అవసరం. తద్వారా సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
 
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా-అహ్మదాబాద్
 కోర్సు: పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్-బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్)
 ప్రవేశం: క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ/సీమ్యాట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
 వివరాలకు: www.ediindia.org
 సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్- హైదరాబాద్
 వివరాలకు: www.cedhyderabad.org
 ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (దూర విద్యా విధానంలో)-న్యూఢిల్లీ
 వివరాలకు: www.ignou.ac.in
 
 
 వెటర్నరీ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?    
 -శర ణ్, కూకట్‌పల్లి.
 వ్యవసాయానుబంధ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో వెటర్నరీ సైన్స్.. సంబంధిత కోర్సులను అభ్యసించిన వారికి డిమాండ్ భారీగా ఉంటోంది. వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని చెప్పొచ్చు. వీరికి పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జులాజికల్ పార్క్స్, ఇన్సూరెన్స్ సంస్థల్లో, ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. ఇటీవల కాలంలో.. జంతు సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో.. సొంత క్లినిక్‌లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

సంబంధిత పరిశోధనా సంస్థల్లో సైంటిస్ట్‌గా చేరొచ్చు. టీచింగ్ ప్రొఫెషన్ కూడా ఎంచుకోవచ్చు. వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్ కోర్సును బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ)గా పేర్కొంటారు. ఈ కోర్సు తర్వాత పీజీ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును ఎంవీఎస్సీ (మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్)గా వ్యవహరిస్తారు. మన రాష్ట్రంలో ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). జాతీయ స్థాయిలో.. జాతీయ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ (ఏఐపీవీటీ) టెస్ట్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రస్థాయి వెటర్నరీ (జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.
 వివరాలకు:www.vci.nic.in
 
 ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి?
 -కీర్తి, అమలాపురం.
నేటి కార్పొరేట్ యుగంలో బర్త్ డే పార్టీ నుంచి మ్యారేజ్ వరకు టక్కున గుర్తొచ్చే పదం.. ఈవెంట్ మేనేజ్‌మెంట్.. ప్రొడక్ట్ లాంచింగ్ నుంచి కార్పొరేట్ కాన్ఫరెన్స్‌లు, సెమినార్లు, వర్‌‌కషాప్స్, సినిమా అవార్డుల ప్రదానం.. ఇలా అనేక కార్యక్రమాల నిర్వహణకు ఈవెంట్ మేనేజర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి నేటి కార్పొరేట్ ప్రపంచం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతూ.. ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి విజ్‌క్రాఫ్ట్ వంటి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, వివిధ టీవీ చానెల్స్‌లో ఈవెంట్ మేనేజర్‌గా, లాక్మే వంటి సంస్థలు నిర్వహించే ఫ్యాషన్‌షో కో-ఆర్డినేటర్లుగా అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఫిల్మ్‌ఫేర్ వంటి వివిధ మీడియా హౌస్‌లు, టూరిజం, అడ్వర్టైజ్‌మెంట్ హౌస్‌ల్లో కూడా స్థిరపడొచ్చు. విదేశాల్లోనూ, పర్సెప్ట్ డీ మార్క్, సీఎన్‌బీసీ, డీఎన్‌ఏ నెట్‌వర్క్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది.
 
 ఆఫర్ చేస్త్తున్న సంస్థలు:
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్-ముంబై
 కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
 వెబ్‌సైట్: www.niemindia.com
 ఈఎండీఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ కమ్యూనికేషన్- హైదరాబాద్
 కోర్సు: పీజీ డిప్లొమా/డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్
 వెబ్‌సైట్: www.emdiworld.com
 అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్
 (అమిటీ యూనివర్సిటీ)-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.amity.edu/aiem
 
 
 ఫిషరీస్ సెన్సైస్ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -భాస్కర్, బాపట్ల.
 ఓషియానోగ్రఫీ, మెరైన్ బయాలజీ, ఎకాలజీ, పాపులేషన్ డైనమిక్స్ వంటి అంశాలను అధ్యయనం చేసే ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్.. ఫిషరీస్ సైన్స్. ఈ విభాగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు ఫిష్ ఫార్మింగ్ యూనిట్స్, ఫిష్ ప్రాసెసింగ్ కంపెనీ వంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటాయి.
 
 ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
 శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి, ఫిషరీస్‌కు సంబంధించి డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ కోర్సులను అందిస్తుంది. వివరాలకు: http://svvu.edu.in
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం, ఎంఎస్సీ (మెరైన్ బయాలజీ అండ్ ఫిషరీస్) సైన్స్ కోర్సును అందిస్తుంది. వివరాలకు: www.andhrauniversity.edu.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement