రూ. 5 లక్షల కోట్లు సిద్ధం
ఎస్‌బీఐ చీఫ్ దినేశ్ కుమార్ ఖారా వెల్లడి
న్యూఢిల్లీ: కార్పొరేట్ రంగంలో నిర్వహణ మూలధనానికి గణనీయంగా డిమాండ్ నెలకొందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. దాదాపు రూ. 5 లక్షల కోట్ల మేర రుణాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో కార్పొరేట్ల దగ్గర మిగులు నిధులు పుష్కలంగా ఉండేవని కానీ ప్రస్తుతం తమ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సామర్థ్యాల విస్తరణకు కావాల్సిన నిధులను రుణంగా తీసుకునేందుకు అవి బ్యాంకులను సంప్రదిస్తున్నాయని ఖారా వివరించారు.
మరోవైపు, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పటికీ ఈ ఏడాది రిటైల్ వ్యవసాయం, చిన్న .. మధ్యతరహా సంస్థలకు (ఆర్‌ఏఎం) రుణాలు 16 శాతం పెరగవచ్చని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగ రుణాలు 16 శాతం వృద్ధి రేటుతో రూ. 21 లక్షల కోట్లకు చేరాయి. ఆర్‌ఏఎం రుణాలిచ్చేటప్పుడు రిసు్కలను మదింపు చేసేందుకు చాలా కఠినతరమైన ప్రక్రియను పాటిస్తామని, వడ్డీ రేట్ల పరిస్థితులు, రుణగ్రహీత సకాలంలో తిరిగి చెల్లించే అవకాశాలు మొదలైనవన్నీ పరిశీలిస్తామని ఖారా చెప్పారు. కఠినతరమైన ప్రమాణాల కారణంగా తమకు ఈ విభాగంలో ఎలాంటి సవాళ్లు లేవని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment