నారాయణ కాలేజీలో విద్యార్థిపై దాడి
Published Wed, Sep 7 2016 5:24 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
హైదరాబాద్ : నగరంలోని హయత్‌నగర్ నారాయణ కళాశాలలో ఓ విద్యార్థిపై దాడి జరిగింది. విద్యార్థి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కళాశాల హాస్టల్‌లో మద్యం సేవించిన ఆరుగురు విద్యార్థులు తోటి విద్యార్థిని చితకబాదారు.
ఈ దాడిలో నవీన్(17) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధితుని కుటుంబసభ్యులు, బంధవులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అన్యాయంగా తమ కొడుకును కొట్టిన విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement