
కథానాయిక కృతీ సనన్ ఇటీవల కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా నెగటివ్ వచ్చిందని స్వయంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఓ హిందీ సినిమా చిత్రీకరణలో భాగంగా చండీఘర్ వెళ్లారామె. అప్పుడే కోవిడ్ బారినపడ్డారు. ‘‘కోవిడ్ నెగటివ్ వచ్చిందనే వార్త షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు సహాయపడ్డ వైద్యులకు ధన్యవాదాలు. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు’’ అని ట్వీట్ చేశారు కృతీ సనన్. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అక్షయ్ కుమార్ ‘బచ్చన్ పాండే’ చిత్రీ కరణలో పాల్గొంటారామె.
Comments
Please login to add a commentAdd a comment