కరోనా: ఆ టెస్ట్‌లో నెగిటివ్‌ వస్తే నమ్మలేం | If Rapid Antigen Tests Find Negative For Covid Do RT PCR Test | Sakshi
Sakshi News home page

కరోనా టెస్టులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

Published Thu, Sep 10 2020 2:15 PM | Last Updated on Thu, Sep 10 2020 2:25 PM

If Rapid Antigen Tests Find Negative For Covid Do RT PCR Test - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంపై కరోనా కరాళ నృత్యం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఊసరవెల్లి మాదిరి వైరస్‌ తన పరిమాణాన్ని మార్చుకుంటూ.. శక్తివంతంగా మారుతూ ప్రపంచానికి సవాలు విసురుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా పరీక్షల విషయంలో నేటికి ఎన్నో అపోహలు. ఈ నేపథ్యంలో కేంద్రం గురువారం కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాపిడ్‌ యాంటి జెన్‌ టెస్టులో పాజిటివ్‌ వస్తే... వైరస్‌ సోకినట్లు అర్థం. అయితే ఈ టెస్టులో ఒకవేళ నెగిటివ్‌ వస్తే నమ్మలేమని కేంద్రం అభిప్రాయపడింది. లక్షణాలు ఉండి.. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులో నెగిటివ్‌ వస్తే.. ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టు చేయాల్సిందిగా కేంద్రం సూచించింది. ఈ టెస్టులో గనక నెగిటివ్‌ అని వస్తే.. అప్పుడు కరోనా లేనట్టే అని తెలిపింది. ఇంతకు ఈ టెస్టులు ఏంటో.. వాటి వివరాలు చూడండి.. (చదవండి: క‌రోనా పాజిటివ్.. త‌ప్పుడు రిపోర్ట్ అనుకుంటా)

ర్యాపిడ్‌ యాంటి జెన్‌ టెస్ట్‌
కరోనా నిర్ధారణ కోసం చేసే ఈ పరీక్షలో ఖర్చు తక్కువ.. ఫలితం కూడా అర్థగంటలోపే వస్తుంది. దీనిలో వైరస్‌పై స్పందించేందుకు సదరు వ్యక్తి శరీరంలో యాంటీబాడీలు తయారయ్యాయ లేదా అనే విషయం ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. ఒక వేళ యాంటీబాడీలు ఉత్పత్తి అయితే పాజిటివ్‌.. లేదంటే నెగిటివ్‌గా ఫలితాలను నిర్ధారిస్తారు. సాధారణంగా ఈ పరీక్షలను ఎక్కువగా కరోనా హాట్‌స్పాట్‌ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అయితే కొన్నిసార్లు కరోనా సోకినప్పటికి యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోతే.. నెగిటివ్‌గా వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ రావడం జరిగిందన్నారు వైద్యులు.

ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్ట్‌
రివర్స్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ-పీసీఆర్‌) అనేది ల్యాబ్‌లో ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చే ప్రక్రియ. యాంటీబాడీ టెస్టుల్లో భాగంగా వైరస్‌ను కనుగొని దానికి శరీరం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఈ పరీక్షల్లో నిర్ధారిస్తారు. ఇందుకోసం రోగి శరీరంలోని శ్వాస మార్గం, గొంతు, ముక్కు నుంచి నమూనాలను సేకరిస్తారు. వీటి ఫలితాలు రావడానికి 12-24 గంటల సమయం పడుతుంది. ఖరీదైనది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement