డై..లాగి కొడితే...
సినిమా : ఆది
రచయితలు: పరుచూరి బ్రదర్స్
దర్శకత్వం: వీవీ వినాయక్
ఆది (ఎన్టీఆర్), నందు (కీర్తిచావ్లా) కాలేజీలో ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయం తండ్రి నాగిరెడ్డికి (రాజన్ పి.దేవ్) చెబుతుంది నందు. ఆదిని ఇంటికి పిలిపించమని కూతురికి చెబుతాడు తండ్రి. నాగిరెడ్డి ఇంటికొచ్చిన ఆది.. నా పేరు ఆదికేశవ రెడ్డి అంటాడు. అంటే.. అని నాగిరెడ్డి ఆరా తీయబోతుండగా.. ఎస్.. ఆయన మనవడినే. ‘నాగిరెడ్డి.. నేనెవరో తెలిసాక నువ్వు పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా.. చేయకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే’ అంటాడు ఆది. రేయ్ అని నాగిరెడ్డి అరిస్తే.. రేయ్..అరవకు..
అమ్మతోడు.. అడ్డంగా నరికేస్తా!
చెప్పేది విను అంటూ నాగిరెడ్డికి వార్నింగ్ ఇస్తాడు ఆది. అమ్మ తోడు... ఈ డైలాగ్ సూపర్ హిట్..