V V Vinayak
-
నాగ అన్వేష్ హీరోగా ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’
షో టైం స్టూడియో సమర్పించు గణేష్ క్రియేషన్స్ సంస్థ నుంచి నాలుగవ ప్రొడక్షన్ గా ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే చిత్రం తెరకెక్కనుంది. నాగ అన్వేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ... ‘మా బ్యానర్ లో తొలిచిత్ర ఓపెనింగ్ స్వర్గీయ రామానాయుడి గారి చేతుల మీదుగా జరిగింది. ప్రస్తుతం మా బ్యానర్లో నాలుగవ సినిమాను రూపొందిస్తున్నాం. నేను లండన్ లో ఉండటం మూలాన లండన్ అనేది ఇంటిపేరుగా మారిపోయింది. ఇక సినిమా విషయానికి వస్తే ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగ అన్వేష్ హీరోగా, నా స్నేహితుడు నాగేశ్వర రావు సహకారంతో నిర్మించడం జరుగుతోంది. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందే చిత్రం అవుతుందని భావిస్తున్నా’ అన్నారు. మరో నిర్మాత వి.నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ‘మంచి కథ అవడంతోనే నేను భాగస్వామిని అయ్యాను. ఫారిన్, సిటీ, ఫారెస్ట్ ఇలా 3 షెడ్యూల్లలో షూటింగ్ ఉంటుంది. కొత్త కథ కనుక ఆడియన్స్ కు నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా’ అన్నారు. హీరో నాగ అన్వేష్ మాట్లాడుతూ.. ‘చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.. టైటిల్ కు తగ్గట్టుగానే ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అనే విదంగానే ఉంటుంది ప్రతి సన్నివేశం. టాలీవుడ్ లొనే డిఫరెంట్ సబ్జెక్టుగా నిలుస్తుందని, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. ‘సైన్క్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేస్తాము. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి తమ అమూల్యమైన ఆశీర్వచనాలు అందించిన వి వి వినాయక్, సాగర్, మరియు రమణ గారికి నా కృతజ్ఞతలు’ అన్నారు. -
సెన్సేషనల్ హిట్ సాధించాం అనిపిస్తోంది – సి. కల్యాణ్
‘‘ఆర్టిస్టుల నుంచి ఎలా నటన రాబట్టుకోవాలో వినాయక్‌కి బాగా తెలుసు. ఆయన దర్శకత్వంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో నటవారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘ఇంటిలిజెంట్’ హిట్ అవ్వాలి. సీకే ఎంటర్టైమెంట్స్ నా సొంత బేనర్‌తో సమానం. కళ్యాణ్‌గారు పెద్ద హీరోలతో, చిన్న హీరోలతో ఇంకా సినిమా చేయాలి. ఈ సినిమా విషయానికి వస్తే వినాయక్, ఆకుల శివ కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. టీజర్ చాలా బాగుంది. సినిమా ఎప్పుడు చూడాలా అనిపిస్తోంది. మెగా అభిమానులకు, ఇది నా బేనర్ కాబట్టి నా అభిమానులకు, ముఖ్యంగా యూత్‌కి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది’’ అన్నారు హీరో బాలకృష. సాయిధరమ్ తేజ్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్టైమెంట్స్పై సి. కల్యాణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ చిత్రం టీజర్‌ను బాలకృష్ణ విడుదల చేశారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ– ‘‘మా బాలయ్యబాబు టీజర్ రిలీజ్ చేయడంతో నేను పెద్ద సెన్సేషన్ హిట్ సాధించినట్లుగా భావిస్తున్నాను. 2018 ప్రారంభంలో బాలకృష్ణగారు ‘జై సింహా’ హిట్ రూపంలో నాకు మంచి ఎనర్జీ ఇచ్చారు. ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న ‘ఇంటిలిజెంట్’ సూపర్‌హిట్ గ్యారంటీ’’ అన్నారు. ‘‘మేం అడగ్గానే బాలకృష్ణగారు రావడంతో ఈ సినిమా సూపర్‌హిట్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేసింది’’ అన్నారు వినాయక్. ‘‘కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చెయ్యడానికి బాలకృష్ణగారు ముందుంటారని అందరూ అంటారు. మా సినిమాకి ఆశీస్సులు అందించడానికి రావడంతో మరోసారి అది ప్రూవ్ అయ్యింది’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకను రాజమండ్రిలో జరపాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సహ నిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా. -
‘బిచ్చగాడు’ కన్నా పెద్ద హిట్ అవ్వాలి: వినాయక్
‘‘మదర్ సెంటిమెం ట్‌తో వచ్చిన ‘బిచ్చ గాడు’ పెద్ద హిట్ అయింది. ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తోన్న ‘యమన్’ ఆ చిత్రం కంటే పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. విజయ్ ఆంటోని హీరోగా జీవశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమన్’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. టీజర్‌ను వినాయక్ రిలీజ్ చేశారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల శివరాత్రికి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. లైకా ప్రొడక్షన్స్ రాజా, చిత్ర సమర్పకులు మిర్యాల సత్యనారాయణరెడ్డి, పాటల రచయిత భాషశ్రీ, నిర్మాత కాశీ విశ్వనాధ్ పాల్గొన్నారు. -
డై..లాగి కొడితే...
సినిమా : ఆది రచయితలు: పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం: వీవీ వినాయక్ ఆది (ఎన్టీఆర్), నందు (కీర్తిచావ్లా) కాలేజీలో ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయం తండ్రి నాగిరెడ్డికి (రాజన్ పి.దేవ్) చెబుతుంది నందు. ఆదిని ఇంటికి పిలిపించమని కూతురికి చెబుతాడు తండ్రి. నాగిరెడ్డి ఇంటికొచ్చిన ఆది.. నా పేరు ఆదికేశవ రెడ్డి అంటాడు. అంటే.. అని నాగిరెడ్డి ఆరా తీయబోతుండగా.. ఎస్.. ఆయన మనవడినే. ‘నాగిరెడ్డి.. నేనెవరో తెలిసాక నువ్వు పరువుగా ఫీలయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ, నువ్వు చేసినా.. చేయకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే’ అంటాడు ఆది. రేయ్ అని నాగిరెడ్డి అరిస్తే.. రేయ్..అరవకు.. అమ్మతోడు.. అడ్డంగా నరికేస్తా! చెప్పేది విను అంటూ నాగిరెడ్డికి వార్నింగ్ ఇస్తాడు ఆది. అమ్మ తోడు... ఈ డైలాగ్ సూపర్ హిట్.. -
ట్విస్టులతో సాగుతున్న చిరు రీలాంచ్
-
దసరా బుల్లోడా?
విదేశాల్లో షూటింగ్... అందులోనూ ఒకటీ రెండు రోజులు కాదు... ఏకంగా నెల రోజులు. హీరోగా తొలి చిత్రం చేస్తున్న అఖిల్‌కు మొదటి సినిమా షూటింగే ఇప్పుడు మధురానుభూతిగా మారింది. స్పెయిన్‌లో ఈ కొత్త చిత్రం షూటింగ్ ముగించుకొని, ఈ యువ హీరో ఇప్పుడు ఇంటి ముఖం పట్టారు. అఖిల్‌కు సన్నిహితుడైన హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ చిత్రాలను తీయడంలో సిద్ధహస్తుడైన వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. తొలి సినిమాకే విదేశాల్లో షూటింగ్లో పాల్గొనడం సహజంగానే అఖిల్‌కు ఆనందాన్నిస్తోంది. స్పెయిన్‌లో ఏకధాటిగా జరిగిన ఈ షూటింగ్లో కొన్ని కీలక సన్నివేశాలు, ఫైట్లు, పాటలు చిత్రీకరించారు. విశేషం ఏమిటంటే, అక్కడ షూటింగ్ జరుగుతుండగా, నాగ్, అమల కలసి షూటింగ్ స్పాట్‌కు వెళ్ళారు. ‘‘మా అమ్మా నాన్న కలసి స్పెయిన్‌లో మా షూటింగ్ సెట్స్‌కు రావడం నాకెంతో గర్వంగా అనిపించింది’’ అని అఖిల్ చెప్పారు కూడా! శేఖర్ మాస్టర్‌తో డ్యాన్సులు, స్పెయిన్‌లోని అద్భుతమైన మష్రూమ్ బిల్డింగ్ దగ్గర స్టంట్ మాస్టర్ రవివర్మతో యాక్షన్ సీన్లు, హీరోయిన్ సాయేషా సైగల్తో పాటలు - ఇవన్నీ అఖిల్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. వేగంగా షూటింగ్ చేసే వినాయక్ నుంచి ఈ కొత్త హీరో చాలానే నేర్చుకున్నట్లున్నారు. హీరో నితిన్ కూడా స్పెయిన్‌కు వచ్చి వెళ్ళడం,షూటింగ్లో ఉండగానే అమితాబ్ - దీపికా పదుకొనేల ‘పికూ’ చిత్రం బాగుందని తెలిసి ఆ సినిమా ఆడుతున్న హాలు కోసం వెతుక్కోవడం - ఇవన్నీ అఖిల్‌కు తీపి గుర్తులే! అన్నట్లు, ఈ సినిమా టైటిల్ ‘మిస్సైల్’ అంటూ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని సాక్షాత్తూ నితిన్ ట్వీట్ చేశారు. ఇంకా టైటిల్ ఏదీ నిర్ణయించలేదన్నారు. టైటిల్ మాటెలా ఉన్నా, శరవేగపు షూటింగ్లో మిస్సైల్‌ను తలపిస్తున్న ఈ చిత్రం దసరా పండుగకల్లా ప్రేక్షకుల్ని పలకరించే అవకాశం ఉందట! -
అంతకు మించి...
అంజలి నటించిన ‘గీతాంజలి’ ఎంతగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిందో... స్వాతి నటిస్తున్న ‘త్రిపుర’ అంతకు మించి ఉంటుందని దర్శకుడు రాజకిరణ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘త్రిపుర’. స్వాతి, నవీన్‌చంద్ర ముఖ్య తారలుగా క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జువినాయక్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కథ గురించి రచయిత వెలిగొండ శ్రీనివాస్ చెప్పారు. చాలా నచ్చింది. విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్‌ల స్క్రీన్‌ప్లే హైలైట్ అని రాజకిరణ్ చెప్పారు. -
అఖిల్‌తో జతకడుతోన్న సుందరి.. సయేషా!
-
సుమోలు పేల్చకపోతే నిరుత్సాహపడతామన్నారు.. అందుకే..!
హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో వీవీ వినాయక్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన సినిమాల్లోని హీరోలు ఆఫ్రికన్ సింహాల్లా ఉంటారు. అందుకే... ప్రముఖ కథానాయకులు సైతం వినాయక్ దర్శకత్వంలో నటించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఈ సారి అదృష్టం కొత్త హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి దక్కింది. తనను తెరకు పరిచయం చేస్తూ... వినాయక్ తెరకెక్కించిన ‘అల్లుడు శీను’ ఈ నెల 25న విడుదల కానుంది. నేడు వినాయక్ పుట్టిన రోజు. విడుదల కానున్న ఈ సినిమా గురించి, చేయనున్న ఇతర చిత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు వినాయక్. ఆ విశేషాల్లోకి... సాయిశ్రీనివాస్ నాకు తాను చిన్నపిల్లాడిగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. బొద్దుగా, ముద్దుగా ఉండేవాడు. అప్పుడే ‘శ్రీనివాస్‌ని హీరో చేద్దామండీ’ అని బెల్లంకొండ సురేశ్‌తో అంటుండేవాణ్ణి. తథాస్తు దేవతలు తథాస్తు అన్నట్లున్నారు. కొన్ని మంచి సినిమాలు వాటంతట అవే తయారవుతాయి అంటుంటారు. ఈ సినిమాకు అదే జరిగింది. జపాన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య ఈ షూటింగ్ చేయడం కష్టం అనిపించినా, చేసేశాం. అబూదాబీలో ప్రపంచ ప్రఖ్యాత రిసార్ట్ ఆల్ఖజ్రాలో షూటింగ్ జరుపుదాం అనుకున్నాం. కానీ ముందు కుదర్లేదు. తర్వాత అది కూడా అమరింది. షూటింగ్ మొదలుపెట్టే ముందు సమంత, తమన్నా లాంటి ఇద్దరు హీరోయిన్లతో పాటలు ఉంటే బావుంటుందని సురేశ్‌గారు అన్నారు. అనుకున్నట్లే సమంతతో పాటు తమన్నా కూడా వచ్చి చేరింది. ప్రకాశ్‌రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టుల ముందు కూడా అలవోకగా నటించేశాడు శ్రీనివాస్. సమంత, తమన్నాలతో డాన్స్ చేయడానికి జంకుతాడేమో అనుకున్నాను. కానీ... అదరహో అనిపించాడు. తనకు కష్టపడే తత్వం ఉంది. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. సుమోలను పైకి లేపడం, బాంబ్ బ్లాస్టింగ్లు లేకుండా నా శైలికి భిన్నంగా ఈ సినిమా చేయాలనుకున్నా. కానీ... యూనిట్ మొత్తం విదేశాలకు వెళ్తుంటే... ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఉన్నత అధికారి నన్ను చూసి ‘సార్.. వినాయక్గారూ.. ఈ సినిమాలో కూడా సుమోలను పేలుస్తున్నారా? బాగా పేల్చాలి. లేకపోతే మేం డిజప్పాయింట్ అవుతాం’ అన్నారు. నేను షాక్. ఒకవేళ ఇవేమీ లేకపోతే జనాలు కూడా డిజప్పాయింట్ అవుతారేమో అనిపించింది. అందుకే... ఇందులో కూడా యాక్షన్ ఉంటుంది. సాయి శ్రీనివాస్ కొత్త హీరో. అతనితో భారీగా డైలాగులు చెప్పిస్తే ‘అవసరమా’ అంటారు. అందుకే, తన పాత్ర చిత్రణను జనాలకు చేరువయ్యేలా తీర్చిదిద్దాం. తక్కువ సంభాషణలతో హీరోయిజం ఎలివేటయ్యేలా తన పాత్ర ఉంటుంది. మామకు జరిగిన అన్యాయానికి అల్లుడు ఎలా బదులు తీర్చుకున్నాడనేది కథ. ఇందులో మామగా ప్రకాశ్‌రాజ్ నటించారు. బ్రహ్మానందంది గమ్మత్తయిన పాత్ర. ఆయన్ను బురిడీ కొట్టించాలనే ఉద్దేశంతోనే ‘నా పేరు అల్లుడు శీను’ అని చెబుతాడు హీరో. పేరు బావుందనిపించి టైటిల్‌గా ఫిక్స్ చేశాం. చిరంజీవిగారి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది. కానీ, అది చిరంజీవిగారి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం కథలు సిద్ధం చేసుకుంటున్నాం. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సినిమా ఉంటుందనే వార్తలో నిజం లేదు. ఒకవేళ చిరంజీవిగారిని డెరైక్ట్ చేసే అవకాశం నాకే లభిస్తే... సరదాగా సాగిపోయే సినిమానే తీస్తా. మధ్యలో ఓ ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండాలి. అలాంటి కథ తీస్తే బావుంటుంది ‘ఠాగూర్’ నాటి చిరంజీవి ఇమేజ్‌కి ఇప్పటి ఇమేజ్‌కి చాలా తేడా ఉందని పలువురి భావన. అందులో నిజం లేదు. ఏ సినిమాకైనా మొదటి పది నిమిషాలే కీలకం. ఆ సమయంలోనే ప్రేక్షకుడు ఇమేజ్‌ల గురించి ఆలోచిస్తాడు. ఈలోపే అతణ్ణి కథలోకి లీనం చేయగలగాలి. అలా చేస్తే సినిమా హిట్.