అంతకు మించి...
అంజలి నటించిన ‘గీతాంజలి’ ఎంతగా ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసిందో... స్వాతి నటిస్తున్న ‘త్రిపుర’ అంతకు మించి ఉంటుందని దర్శకుడు రాజకిరణ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘త్రిపుర’. స్వాతి, నవీన్‌చంద్ర ముఖ్య తారలుగా క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జువినాయక్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా కథ గురించి రచయిత వెలిగొండ శ్రీనివాస్ చెప్పారు. చాలా నచ్చింది. విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్‌ల స్క్రీన్‌ప్లే హైలైట్ అని రాజకిరణ్ చెప్పారు.