‘బిచ్చగాడు’ కన్నా పెద్ద హిట్‌ అవ్వాలి: వినాయక్‌ | Yaman Will Be A Bigger Hit Than Bichagadu Vv Vinayak Vijay Antony | Sakshi
Sakshi News home page

‘బిచ్చగాడు’ కన్నా పెద్ద హిట్‌ అవ్వాలి: వినాయక్‌

Published Thu, Jan 26 2017 12:35 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

‘బిచ్చగాడు’ కన్నా పెద్ద హిట్‌ అవ్వాలి: వినాయక్‌

‘బిచ్చగాడు’ కన్నా పెద్ద హిట్‌ అవ్వాలి: వినాయక్‌

‘‘మదర్‌ సెంటిమెం ట్‌తో వచ్చిన ‘బిచ్చ గాడు’ పెద్ద హిట్‌ అయింది. ఫాదర్‌ సెంటిమెంట్‌తో వస్తోన్న ‘యమన్‌’ ఆ చిత్రం కంటే పెద్ద హిట్‌ కావాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్‌ అన్నారు. విజయ్‌ ఆంటోని హీరోగా జీవశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యమన్‌’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ద్వారక క్రియేషన్స్‌పై  మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

టీజర్‌ను వినాయక్‌ రిలీజ్‌ చేశారు. మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ – ‘‘తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల శివరాత్రికి రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌ రాజా, చిత్ర సమర్పకులు మిర్యాల సత్యనారాయణరెడ్డి, పాటల రచయిత భాషశ్రీ, నిర్మాత కాశీ విశ్వనాధ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement