
పెళ్లికొడుకు కాబోతున్న ఆది?
డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడిగా తెరంగేట్రం చేసిన ఆది.. త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్నాడట. అతడి మహిళా అభిమానులకు ఇది పెద్ద షాకే అయినా.. అందుకు మరో మూడు నాలుగు నెలల వరకు సమయం ఉందన్నది మాత్రం కొంత ఊరటనిచ్చే అంశం.
ఈ విషయాన్ని ఆది గానీ, అటు సాయికుమార్ గానీ ఇంతవరకు నిర్ధారించలేదు. అయితే ఫిలింనగర్ మొత్తం ఇప్పుడు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఒక అమ్మాయిని ఆది ఇష్టపడ్డాడని, ఆ పెళ్లికి ఇరువైపుల పెద్దలు కూడా అంగీకరించి పెళ్లి చేయిస్తున్నారని చెబుతున్నారు. బహుశా త్వరలోనే సాయికుమార్ ఈ అంశంపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.