యంగ్ హీరో ఆదికి తండ్రిగా ప్రమోషన్ | young hero aadi blessed with a baby girl | Sakshi
Sakshi News home page

యంగ్ హీరో ఆదికి తండ్రిగా ప్రమోషన్

Dec 18 2015 10:00 AM | Updated on Sep 3 2017 2:12 PM

యంగ్ హీరో ఆదికి తండ్రిగా ప్రమోషన్

యంగ్ హీరో ఆదికి తండ్రిగా ప్రమోషన్

త్వరలో గరం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న యంగ్ హీరో ఆది.. సినిమా రిలీజ్ కు ముందే మరో శుభవార్త చెప్పాడు.

త్వరలో గరం సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న యంగ్ హీరో ఆది.. సినిమా రిలీజ్ కు ముందే మరో శుభవార్త చెప్పాడు. గురువారం మధ్యాహ్నం ఆది భార్య అరుణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆది దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

కొడుకును హీరోగా నిలబెట్టడం కోసం సాయికుమార్ తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా గరం త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు లవర్ బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆది ఈ సినిమాతో మాస్ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదాశర్మ హీరోయిన్ గా నటించింది. అగస్త్య సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement