వీ4 తొలి సినిమా ఆదితో..! | Prabhakar to direct aadi in v4 productions | Sakshi
Sakshi News home page

వీ4 తొలి సినిమా ఆదితో..!

Published Fri, Mar 10 2017 2:08 PM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

వీ4 తొలి సినిమా ఆదితో..!

వీ4 తొలి సినిమా ఆదితో..!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, యువి ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలతో కలిసి వీ4 పేరుతో కొత్త బ్యానర్ నెలకొల్పిన సంగతి తెలిసింది. ముందుగా ఈ బ్యానర్ పై భారీ చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ బ్యానర్ తొలి ప్రయత్నంగా ఓ చిన్న సినిమాను ప్రారంభిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేని డిఫరెంట్ కాంబినేషన్ను ఈ సినిమా కోసం సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోతో పాటు దర్శకుణ్ని కూడా ఫైనల్ చేసిన నిర్మాతలు త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నారు.

కెరీర్ స్టార్టింగ్లో మంచి ఫాంలోనే కనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ హీరో ఆది. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆది, హీరోగా స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతున్నాడు. ఈ యంగ్ హీరోతో టీవీ స్టార్ ప్రభాకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది వీ4 సంస్థ. గతంలో ప్రభాకర్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమా పట్టాలెక్కనుందన్న వార్త వినిపించింది.

అయితే శిరీష్ సినిమాను పక్కన పెట్టేసిన ప్రభాకర్ ఆది హీరోగా సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ఈ ఏడాదిలోనే మరో రెండు చిన్న మీడియం రేంజ్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement