v4 productions
-
గమ్మునుండవోయ్
‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి చెప్పిన డైలాగ్ ఇది. పిల్లలకు, పెద్దలకు గోన గన్నారెడ్డి అలియాస్ అల్లు అర్జున్ ఓ వెరైటీ స్టైల్లో చెప్పిన ఈ డైలాగ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఇప్పుడీ డైలాగ్‌ని గుర్తు చేయడానికి కారణం ఉంది. ఫిల్మ్ నగర్లో బన్నీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సొంత బేనర్ పెట్టి, బన్నీ ప్రొడ్యూసర్ కావాలనుకుంటున్నాడన్నది ఆ వార్త సారాంశం. నిర్మాతగా తన తొలి చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడితో తీయడానికి రెడీ అయిపోయాడని కూడా చెప్పుకుంటారు. నిజమేనా బాసూ? అని అడిగితే.. ‘గమ్మునుండవోయ్’ అని ఫిల్మ్‌నగర్‌లో ఓ వర్గం అంటోంది. తండ్రి అల్లు అరవింద్ సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తోన్న గీతా ఆర్ట్స్, భాగసామ్యంలో నడిపిస్తోన్న ‘జీఏ2’, ‘వి4’.. ఇన్ని బేనర్లు ఉండగా బన్నీ ఇంకో కొత్త బేనర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటున్నారు. పాయింటే కదా. బన్నీ సన్నిహిత వర్గాలు కూడా ‘ఇది గాసిప్’ అని తేల్చేశాయి. సో.. బన్నీ సొంత బేనర్ పెట్టడంలేదు. భవిష్యత్తులో నిర్మాత అవ్వాలనుకుంటే ‘జీఏ2’ బేనర్ మీద నిర్మించాలనే ఆలోచన ఉందట. అప్పటివరకూ గమ్మునుందాం. -
వీ4 తొలి సినిమా ఆదితో..!
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, యువి ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలతో కలిసి వీ4 పేరుతో కొత్త బ్యానర్ నెలకొల్పిన సంగతి తెలిసింది. ముందుగా ఈ బ్యానర్ పై భారీ చిత్రాలను మాత్రమే తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ బ్యానర్ తొలి ప్రయత్నంగా ఓ చిన్న సినిమాను ప్రారంభిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేని డిఫరెంట్ కాంబినేషన్‌ను ఈ సినిమా కోసం సెట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోతో పాటు దర్శకుణ్ని కూడా ఫైనల్ చేసిన నిర్మాతలు త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి ఫాంలోనే కనిపించినా.. తరువాత వరుస ఫ్లాప్ లతో కష్టాల్లో పడ్డ హీరో ఆది. సాయికుమార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆది, హీరోగా స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతున్నాడు. ఈ యంగ్ హీరోతో టీవీ స్టార్ ప్రభాకర్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది వీ4 సంస్థ. గతంలో ప్రభాకర్ దర్శకత్వంలో శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో సినిమా పట్టాలెక్కనుందన్న వార్త వినిపించింది. అయితే శిరీష్ సినిమాను పక్కన పెట్టేసిన ప్రభాకర్ ఆది హీరోగా సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు ఈ ఏడాదిలోనే మరో రెండు చిన్న మీడియం రేంజ్ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.