యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.
రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?
రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్‌నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.
Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB
— ahavideoin (@ahavideoIN) January 14, 2025
Comments
Please login to add a commentAdd a comment