Chandrahas
-
ఓటీటీకి టాలీవుడ్ మూవీ.. మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్!
యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడైన చంద్రహాస్ తొలి సినిమానే 'రామ్ నగర్ బన్నీ'. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించారు. గతేడాది అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను పెద్దగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.రామ్ నగర్ బన్నీ కథేంటంటే..?రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB— ahavideoin (@ahavideoIN) January 14, 2025 -
‘ఆటిట్యూడ్ స్టార్’ ట్యాగ్‌కి అర్హుణ్ణి కాదంటే తీసేస్తాను: చంద్రహాస్
‘‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ ఔట్పుట్ చూశాక సినిమా విజయంపై మాకు చాలా నమ్మకం వచ్చింది’’ అని చంద్రహాస్ అన్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వంలో చంద్రహాస్ హీరోగా నటించిన చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా చంద్రహాస్ మాట్లాడుతూ– ‘‘శ్రీనివాస్ మహత్గారు ఫైట్స్, డ్యాన్స్, లవ్, ఎమోషన్, రొమాంటిక్ ఇలా... అన్ని షేడ్స్‌లో నన్ను బాగా చూపించారు. అన్ని అంశాలున్న ‘రామ్‌నగర్ బన్నీ’ నా తొలి సినిమా కావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రం చూశాక ‘ఆటిట్యూడ్ స్టార్’ అనే ట్యాగ్‌కు నేను అర్హుణ్ణి కాదంటే తీసేస్తాను. ఈ కథపై ఉన్న నమ్మకంతోనే మా నాన్న ప్రభాకర్‌గారు సినిమా నిర్మించారు. అన్ని జానర్ మూవీస్‌లో నటించి, మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ప్రస్తుతం నేను నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. మరో సినిమాలో నటిస్తున్నాను’’ అన్నారు. -
రామ్‌నగర్ బన్నీ ఇద్దరికీ హిట్ ఇవ్వాలి: రామ్‌గోపాల్ వర్మ
‘‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బాగా నటించాడు కూడా. ఈ చిత్రం చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద విజయం ఇవ్వాలి’’ అని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు. చంద్రహాస్ హీరోగా శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహించిన చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్లుగా నటించారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ ΄÷డకండ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ– ‘‘రామ్‌నగర్ బన్నీ’ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘‘మా అన్నయ్య చంద్రహాస్‌కు ‘రామ్‌నగర్ బన్నీ’ పెద్ద సక్సెస్ ఇవ్వాలి’’ అని దివిజ ప్రభాకర్ చెప్పారు. ‘‘మా మూవీని రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ వారికి థ్యాంక్స్’’ అని మలయజ ప్రభాకర్ పేర్కొన్నారు. ‘‘నన్ను ఇంతకాలం ఆదరించిన తల్లులు, అక్కా చెల్లెళ్లు మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రభాకర్ ΄÷డకండ. ‘‘మా ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమా నచ్చని ప్రేక్షకులు మీ టికెట్‌ని ఫొటో తీసి ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు పంపితే మీ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను’’ అని చంద్రహాస్ తెలిపారు. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, కరాటే రాజు, హీరోయిన్లు రిచా జోషి, రీతు మంత్ర, అంబికా వాణి, విస్మయ శ్రీ, సంగీత దర్శకుడు అశ్విన్ హేమంత్, నటులు సమీర్, సలీమ్ ఫేకు, ఫైట్ మాస్టర్ రాము, లిరిక్ రైటర్స్ అవినాష్, సాగర్ తదితరులు మాట్లాడారు. -
నలుగురు హీరోయిన్లతో 'రామ్‌నగర్ బన్నీ'.. టీజర్ వచ్చేసింది!
చంద్రహాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ప్రభాకర్ మాట్లాడుతూ ..'నన్ను బుల్లితెరపై ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి.' అని అన్నారు.దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ' ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్తోనే చేయాలని ముందుకొచ్చాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనే అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు. -
నా స్థానంలో వేరేవాళ్లుంటే చచ్చిపోయేవాళ్లు: చంద్రహాస్
బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రహాస్ తనపై వస్తున్న నెగెటివిటీ, ట్రోలింగ్‌పై స్పందించాడు. ఇది నా తొలి సినిమా. ఇలా స్టేజీ ఎక్కి మాట్లాడి రెండేళ్లవుతోంది. అప్పుడు నేను యాటిట్యూడ్ చూపిస్తున్నా అని విపరీతంగా ట్రోల్ చేశారు.తండ్రిని చూసి గర్వపడాలిఅందరిముందు ఒకలా, ఎవరూ లేనప్పుడు మరోలా ప్రవర్తించలేను. పైగా నేను తప్పు చేసినప్పుడు తిడితే పడతాను, కానీ ఏమీ చేయకముందే విమర్శిస్తే మాత్రం సహించను. ఇప్పుడు నేను మా నాన్న గురించి డబ్బా కొట్టబోతున్నాను. ఎవరైనా సరే తండ్రిని చూసి గర్వపడాలి. మీ నాన్నను చూసి గర్వపడటం లేదంటే దానంత దురదృష్టం మరొకటి లేదు.ఎవ్వర్నీ వదలనుమా నాన్న బుల్లితెర మెగాస్టార్. ఆయనొక డైరెక్టర్, యాక్టర్, నిర్మాత. వేల ఎపిసోడ్లలో నటించడమే కాకుండా ఎన్నో షోస్ చేశాడు. మా నాన్న గొప్ప హీరో కాబట్టి నాకు యాటిట్యూడ్ ఉంటుంది. నన్ను తిట్టినవారే ఈ రామ్‌నగర్ బన్నీ మూవీ చూసి పాజిటివ్‌గా మారతారని అనుకుంటున్నాను. తర్వాతి సినిమాకు మరికొందర్ని పాజిటివ్‌గా మారుస్తా.. అలా నన్ను నెగెటివ్‌గా చూస్తున్నవాళ్లందరినీ పాజటివ్‌గా మార్చేవరకు వదలను.ఎంకరేజ్ చేయండినాలాంటివాడు కనక హిట్టు కొట్టాడంటే ఈ జనరేషన్‌కు పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసినవాడినవుతాను. రేపు పొద్దున థియటర్లో యాటిట్యూడ్ స్టార్ అన్న టైటిల్ పడగానే.. మీరందరూ అరిచి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. నా స్నేహితులు చాలామంది నా స్థానంలో వాళ్లుంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాళ్లమని చెప్పారు. అది తప్పు, నాపై ఎంత దాడి చేసినా సరే.. నాకలాంటి ఆలోచనలు రావు. ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోను, నా పని నేను చేసుకుంటూ పోతాను అని చంద్రహాస్ చెప్పుకొచ్చాడు. -
కొడుకుపై దారుణమైన ట్రోల్స్.. స్పందించిన నటుడు ప్రభాకర్
తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై బుల్లితెర మెగాస్టార్, టీవీ నటుడు ప్రభాకర్ ఆసక్తికర రీతిలో స్పందించాడు. కాగా బుల్లితెరపై నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. ఎన్నో సీరియల్స్‌కు నిర్మాతగా వ్యవహరించిన ఆయన చిన్న సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో సినీ, టీవీ రంగంలో దూసుకుపోతున్న ప్రభాకర్ తన వారసుడిగా కొడుకు చంద్రహాస్‌ను హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: కొడుకు ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సౌందర్య రజనీకాంత్ ఇటీవల ఓ చానల్‌తో ముచ్చిటించిన ఆయన తన కొడుకును అందరికి పరిచయం చేశాడు. ఈ సందర్బంగా చంద్రహాస్‌ను చూపిస్తూ.. ‘హీరో కావాలనేది మా అబ్బాయి కల. ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు హీరోగా మూడు సినిమాలు చేస్తున్నారు. అందరి తనని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు. ఈ క్రమంలో చంద్రహాస్ చూపించిన యాటీట్యూడ్, ఆయన నిలుచున్న తీరు చూసి అంతా అతడిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. వీడు హీరో ఏంటీ!.. ఇంకా ఒక్క సినిమా కూడా రాలేదు అప్పుడు పెద్ద స్టార్లా ఫోజులు కొడుతున్నాడు. బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటూ చంద్రహాస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో తాజాగా ఓ తెలుగు మీడియాతో మాట్లాడిన ప్రభాకర్ కొడుకుపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. మీ కొడుకు మూవీ ఎంట్రీపై నెపోటిజం మీద ఏమైనా ట్రోల్స్ వచ్చాయా? అని హోస్ట్ అడగ్గా ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. వాడు వచ్చిందే ఇప్పుడు.. ఇంకా వాడి సినిమాలే బయటకు రాలేదు అన్నాడు. ‘‘పరిచయం చేసిన ఇంటర్య్వూపైనే అందరూ వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. ‘వీడు హీరో ఏంటీ? వాడు ఇటూ తిరిగాడు అటు తిరిగాడు ఎంటీ? జెబులో చేతులు పెట్టుకున్నాడేంటి. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్‌పై గురించి ఏమన్నదంటే.. యూటిట్యూడ్ చూపిస్తున్నాడు’ అంటూ ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. ఎలా అయితే ఏంటీ వాడు జనాల్లోకి వెళ్లాడు. వాళ్లు తిట్టుకుంటున్నారా? పోగుడుతున్నారా? పక్కన పెడితే జనాలకు వాడు తెలియాలని చెప్పాను. తర్వాత వాళ్ల ఇష్టం. వాడు బాగా చేస్తే బాగా చేశాడంటారు. చంద్రహాస్ నిలబడ్డ స్టైల్ వాళ్లకి నచ్చలేదు. అదే చెప్పారు. రేపు యాక్టింగ్ ఎంత బాగా చేస్తే అంత బాగా ఆదరిస్తారు. జనాలు చాలా ప్లేయిన్‌గా ఉంటారు. వారికి అనిపించింది చెబుతారు’ అని ప్రభాకర్ వ్యాఖ్యానించాడు. -
హీరోగా మారిన ప్రభాకర్ తనయుడు చంద్రహాస్
‘‘నేను ఇండ్రస్టీకి వచ్చి 25ఏళ్లు అయింది. మా అబ్బాయి చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది నా భార్య మలయజ. తాను చేసిన యూ ట్యూబ్ వీడియో ద్వారా నా ప్రమేయం లేకుండానే చంద్రహాస్ హీరోగా అవకాశాలు తెచ్చుకోవడం తండ్రిగా గర్వంగా ఉంది’’ అని నటుడు ప్రభాకర్ అన్నారు. ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం కానున్నాడు. నేడు(సెప్టెంబర్ 17) చంద్రహాస్ పుట్టిరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘చంద్రహాస్ చేసిన ‘నాటు నాటు..’ అనే కవర్ సాంగ్ మంచి పేరుతో పాటు హీరోగా రెండు అవకాశాలు తేవడంతో ఆశ్చర్యపోయాను. వీటిలో కృష్ణ దర్శకత్వంలో కిరణ్ బోయినపల్లి, కిరణ్ జక్కంశెట్టి నిర్మిస్తున్న సినిమా, సంపత్ వి. రుద్ర డైరెక్షన్లో ఏవీఆర్, నరేష్గార్లు నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలాగే మా స్వంత సంస్థలో ఓ సినిమా నిర్మించనున్నాం’’ అన్నారు. ప్రభాకర్ భార్య మలయజ మాట్లాడుతూ.. ‘చంద్రహాస్ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్ వర్కర్. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ‘‘పరిశ్రమలోని చాలామందిని చూసి నటుడిగా స్ఫూర్తి పొందాను.. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్‌గార్లు.. వారి అంకితభావానికి హ్యాట్సాఫ్. హీరో అవ్వాలనేది నా కల.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం కోసం కష్టపడతాను’’ అన్నారు చంద్రహాస్.