నలుగురు హీరోయిన్లతో 'రామ్‌నగర్‌ బన్నీ'.. టీజర్‌ వచ్చేసింది! | Tollywood Movie Ramnagar Bunny Teaser Out Now | Sakshi
Sakshi News home page

RamNagar Bunny Teaser: నలుగురు హీరోయిన్లతో 'రామ్‌నగర్‌ బన్నీ'.. టీజర్‌ వచ్చేసింది!

Published Mon, Sep 16 2024 9:20 PM | Last Updated on Tue, Sep 17 2024 9:36 AM

Tollywood Movie Ramnagar Bunny Teaser Out Now

చంద్రహాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం రామ్‌నగర్ బన్నీ. ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.  ఈ సినిమాను దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ప్రభాకర్ మాట్లాడుతూ ..'నన్ను బుల్లితెరపై ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి.' అని అన్నారు.

ran

దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ' ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్‌తోనే చేయాలని ముందుకొచ్చాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు. అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనే అన్ని ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం.' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో మురళీధర్, సలీమ్, మధునందన్, సుజాత, విజయలక్ష్మి, సమీర్, లక్ష్మణ్ టేకుముడి, ప్రణయ్ గణపూర్, శివ, హృశికేష్ గజగౌని కీలక పాత్రలు పోషించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement