ఆదికి జోడిగా మరాఠి భామ | Aadi to romance a marathi Heroine | Sakshi
Sakshi News home page

ఆదికి జోడిగా మరాఠి భామ

Published Sun, Apr 9 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

ఆదికి జోడిగా మరాఠి భామ

ఆదికి జోడిగా మరాఠి భామ

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా చాలా రోజులుగా స్టార్ ఇమేజ్  కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆది.. ప్రేమకావాలి,లవ్ లీ లాంటి హిట్ సినిమాలో నటించిన స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్లతో కెరీర్ను ఇబ్బందుల్లో పడేసుకున్న ఆది, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందు రానున్నాడు.

బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా ఆకట్టుకున్న ప్రభాకర్ దర్శకత్వంలో ఆది హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వీ4 మూవీస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఆదికి జోడిగా ఓ మరాఠి భామను ఎంపిక చేశారు. మరాఠితో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన వైభవీ శాండిల్య, ఆది సరసన హీరోయిన్గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీస్ సంస్థలు సంయుక్తంగా వీ 4 మూవీస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement