Vaibhavi Shandilya
-
సందేశాన్ని ఆశించొద్దు
తమిళసినిమా: ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు చిత్రంలో ఎలాంటి సందేశాన్ని ఆశించొద్దని ఆ చిత్ర దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ తెలిపారు. ఈయన హరహర మహాదేవకీ చిత్రం ద్వారా పరిచయం అయిన దర్శకుడన్నది గమనార్హం.ఆ చిత్ర నిర్మాణ సంస్థ బ్లూ ఘోస్ట్ పిక్చర్స్నే నిర్మిస్తున్న చిత్రం ఇరుట్టు అరైయిల్ మొరట్టు కుత్తు. అదే విధంగా ఆ చిత్ర హీరో గౌతమ్కార్తీక్నే ఈ చిత్రంలోనూ హీరోగా నటించారు. ఇక హీరోయిన్లుగా వైభవి శాండిల్య, యాషిక ఆనంద్, చంద్రిక రవి ముగ్గురు నటించారు. బాలమురళీ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం మే 4వ తేదీన తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర యూనిట్ విలేకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ చిత్ర షూటింగ్‌ను 23 రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. ఇది అడల్ట్ హర్రర్ కామెడీ కథా చిత్రంగా ఉంటుందని, అందువల్ల ఇందులో ఎలాంటి సందేశాన్ని ప్రేక్షకులు ఆశించరాదని అన్నారు. రెండు గంటల పాటు జాలీగా ఎంజాయ్ చేయవచ్చునని అన్నారు. మా చిత్రాన్ని ఎంటర్టెయియినర్గానే చూడాలని కోరుకుంటున్నామన్నారు. ఇక హీరో గౌతమ్ కార్తీక్ విషయానికి వస్తే ఆయనకు ఈ చిత్ర కథ గురించి ఏం చెప్పానో, ఆయన ఏం విన్నారో తనకే తెలియదన్నారు. చిత్రం యూనిట్ అంతా కలిసి చేసిన చిత్రం ఇదని చెప్పారు. చిత్ర హీరో గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అని అన్నారు. అందరం కూర్చుని చర్చించుకుని చిత్రం చేశామని తెలిపారు. ఇలాంటి అడల్ట్ హర్రర్ కథా చిత్రంలో నటించడంపై మీ తండ్రి కార్తీక్ ఎలా స్పందించారు? అన్న ప్రశ్నకు నాన్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఆసక్తిగా ఉన్నారని బదులిచ్చారు. ఇదే సంస్థలో దర్శకుడు ముత్తయ్య దర్శకత్వంలో నటించే అవకాశాన్ని కల్పించిన నిర్మాత జ్ఞానవేల్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని గౌతమ్‌కార్తీక్ అన్నారు. నటి ఆషిక ఆనంద్ పాల్గొన్నారు. -
ఆమెతో థాయ్‌లాండ్ చుట్టొచ్చాడు
తమిళసినిమా: యువ నటుడు గౌతమ్ కార్తీక్ వర్ధమాన నటి వైభవి శాండిల్యతో థాయ్‌లాండ్ చుట్టొచ్చాడు. ఇంతకు ముందు హరహర మహాదేవకీ వంటి విజయవంతమైన చిత్ర కాంబినేషన్ గౌతమ్‌కార్తీక్, దర్శకుడు సంతోష్ పి.జయకుమార్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ ఇందులో సర్వర్‌సుందరం, చక్క పోడు పోడు రాజా చిత్రాల ఫేమ్ వైభవి శాండిల్య నాయకిగా నటిస్తోంది. మరో నటి చంద్రిక దెయ్యంగానూ, నటి యాషిక ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. రాజేంద్రన్, కరుణాకరన్, బాలశేఖరన్, మధుమిత, మీసైమమురుక్కు చిత్రం ఫేమ్ షారా ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దీనికి సంగీతాన్ని బాలమురళీబాలు, ఛాయాగ్రహణం తరుణ్బాలాజీ అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తలుపుతూ ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్ర షూటింగ్‌ను గత అక్టోబర్ నెలలో ప్రారంభించాయని తెలిపారు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగొచ్చి ఇక్కడ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. తదుపరి మళ్లీ తుది షెడ్యూల్ చిత్రీకరణ కోసం త్వరలో థాయ్ లాండ్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ తెలిపారు. -
ఇట్స్ ఏ వైన్ సాంగ్!
రెండు చుక్కలు నోట్లో పడితే... రెండో మనిషి బయటకొస్తాడు. మత్తులో ఏవేవో చేస్తారు. కొందరు మాంచి హుషారున్న పాటేసుకుంటారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి... మత్తులోంచి వచ్చే పాటలు మస్తుగా మజా స్టెప్పులేయిస్తాయి. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు గౌతమ్ కార్తీక్. మణిరత్నం ‘కడలి’తో కథానాయకుడిగా పరిచయమైన ఈ హీరో, ప్రస్తుతం తమిళంలో ‘ఇరతు అరయిల్ మురతు కుతువు’ అనే సినిమా చేస్తున్నారు. అందులో ‘నెక్ట్స్ నువ్వే’ (తెలుగు సినిమా) ఫేమ్ వైభవీ శాండల్య హీరోయిన్. ఈ సినిమా కోసం ఇప్పుడో మత్తుపాటను... అదేనండీ ‘వైన్ సాంగ్’ను షూట్ చేస్తున్నారు. హీరో వైన్ షాపులో రెండు చుక్కలు వేసిన తర్వాత ఈ పాట మొదలవుతుందట. అతను ఏ బాధలో ఉన్నాడో మరి! ‘‘బాబా భాస్కర్ మాస్టర్ వైన్ సాంగ్‌కి కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సూపర్బ్‌గా వస్తోందీ సాంగ్. నెక్ట్స్ షెడ్యూల్ కోసం థాయ్‌లాండ్ వెళతాం’’ అన్నారు చిత్రదర్శకుడు సంతోష్ పి. జయకుమార్. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... కలప్రభు దర్శకత్వంలో గౌతమ్ కార్తీక్ హీరోగా ‘ఇంద్రసేన’ సినిమా చేస్తున్నారు. అందులోని టు మినిట్స్ బైక్ అండ్ జీప్ రేస్ కోసం 10 రోజుల పాటు రిహార్సల్ చేసి సూపర్‌గా నటించారట! ఆయన కమిట్మెంట్ చూసి, టీమ్‌ను షాక్‌కు గురి చేశారట గౌతమ్ కార్తీక్. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేస్తారట!! -
సంసారం.. సేమియా ఉప్మా
‘‘యామిరిక్క భయమేన్’ తమిళ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని రెండేళ్ల క్రితం నా మనసులో అనుకున్నా. రీమేక్ హక్కులు ‘బన్నీ’ వాసుగారి వద్ద ఉన్నాయని తెలిసి, నేను కామ్ అయిపోయా. అయితే, ఆ సినిమా చివరకు నా దగ్గరకే వచ్చింది’’ అని హీరో ఆది అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ముఖ్య తారలుగా యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆది పాత్రికేయులతో పలు విశేషాలు పంచుకున్నారు. ► గతేడాది ప్రభాకర్గారిని కలిస్తే ఇరవై నిమిషాలు ‘నెక్ట్స్ నువ్వే’ కథ చెప్పారు. ‘యామిరిక్క భయమేన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేయడంతో బాగా నచ్చింది. ప్రభాకర్‌గారు ఏంటో నాకు తెలుసు. బాగా డైరెక్ట్ చేస్తారని సినిమా చేయడానికి అంగీకరించా. ► గీతా ఆర్ట్స్ బేనర్ ఈ సినిమా నిర్మిస్తుందని ప్రభాకర్‌గారు చెప్పగానే ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంతా ఓకే అని ‘బన్నీ’ వాసుగారితో మాట్లాడిన తర్వాత జ్ఞానవేల్‌రాజాగారు, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ కూడా నిర్మాణంలో భాగమయ్యారు. క్యారెక్టరైజేషన్స్, కథ, మంచి నిర్మాతలు ఉండటంతో మరో ఆలోచనకు అవకాశం కూడా ఇవ్వలేదు. సింగిల్ షెడ్యూల్లో.. 36 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. ► సినిమాలో నా పాత్ర పేరు కిరణ్. సీరియల్స్ తీస్తుంటాను. రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలనే కోరిక. ‘సంసారం.. సేమియా ఉప్మా’ అనే సీరియల్ తీస్తుంటాడు. నిర్మాతగా ఓ సీరియల్ తీసి, అప్పుల పాలవుతాడు. ఆ అప్పుల నుంచి తప్పించుకోవడానికి రిసార్ట్ స్టార్ట్ చేయాలనుకుంటాడు. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ హాస్యంతో సాగే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. ► ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో బ్రహ్మాజీగారి పాత్ర చూసి, నేనూ ఈయనతో ఓ సినిమా చేస్తే బావుంటుందనుకున్నా. ‘నెక్ట్స్ నువ్వే’తో లక్కీగా ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. ► జ్ఞానవేల్ రాజాగారి స్టూడియో గ్రీన్ బ్యానర్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న మూడు సినిమాలు చేయబోతున్నా. అలాగే, జ్ఞానవేల్ రాజాగారు తెలుగులో చేసే స్ట్రయిట్ మూవీలో కూడా నటిస్తున్నా. -
ఆయన 60 ఏళ్ల టీనేజర్!
‘‘కొత్త వారికి చాన్స్ ఇచ్చేందుకే వి4 బ్యానర్‌ను స్టార్ట్ చేశాం. పెద్ద బ్యానర్స్‌లో కొత్త డైరెక్టర్స్‌తో వెంటనే రిస్క్ చేయలేం. టాలెంటెడ్ యంగ్‌స్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఛాన్స్ ఇచ్చి, వారు వి4 బ్యానర్లో ప్రూవ్ చేసుకుంటే బిగ్ బ్యానర్లో చాన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. రైటర్స్‌ని, మ్యూజిక్ డైరెక్టర్స్‌ని అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఆది, వైభవీ శాండిల్యా, రష్మీ గౌతమ్ ముఖ్య తారలుగా ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. వి4 క్రియేషన్స్ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదల కానుంది. ‘బన్నీ’ వాసు చెప్పిన విశేషాలు... ∙ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడుతున్నారు. కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ మీద నమ్మకంతోనే ఈ సినిమా నిర్మించా. ఆది చాలా ప్రొఫెషనల్. ఒక మంచి సక్సెస్ వస్తే స్టార్హీరో అవుతాడు. ఆ సక్సెస్ ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నాను. ప్రభాకర్‌లో మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయని నమ్మి, మారుతి బ్యానర్లో రికమండ్ చేశాను. ప్రభాకర్ «థర్డ్ మూవీ కూడా లైన్లో ఉంది. నా పార్టనర్స్ కూడా ఓకే అంటే వి4 బ్యానర్లోనే ఆ సినిమా ఉంటుంది. నెక్ట్స్ సినిమాకి ముగ్గరు కుర్రాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ∙అల్లు అరవింద్‌గారు 60 ఏళ్ల వయసున్న టీనేజర్. ‘టు బి విత్ యంగ్ పీపుల్’ అనేదే అరవింద్‌గారి బిజినెస్ సీక్రెట్ అనుకుంటున్నా. నాకు, వంశీ (వి4లో మరో నిర్మాత)కి ఆయన గురువులాంటి వారు. ∙పవన్ కల్యాణ్‌గారి ఫ్యాన్‌ని. ఆయనతో వర్క్ చేయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. దానయ్యగారు ఒక్క మాట చెప్పి ఉండాల్సింది ‘‘అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహేశ్‌బాబు సినిమాను అదే రోజు విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. మేమే ఫస్ట్ ఏప్రిల్ 27 అని డేట్ చెప్పాం. దానయ్య (మహేశ్ సినిమా నిర్మాత) గారు ఒక్క మాట ముందుగా చెబితే మేమిద్దరం కలసి వేరేలా ప్లాన్ చేసేవాళ్లం. కానీ, ఆయన చెప్పకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం బాధ అనిపించింది’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఇప్పుడు దానయ్యగారు మీకు చెబితే డేట్ మార్చుకుంటారా? అనడగితే.. ‘‘నేనే కాదు... ఇద్దరూ చొరవ తీసుకోవాలి. అది సమ్మర్ సీజన్. హిట్ సినిమాలు ఆడతాయి. నేను, లగడపాటి శ్రీధర్ (‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రనిర్మాత) గారితో మాట్లాడి ఇంకో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఐదు నిమిషాల పని. ఏప్రిల్ 27న ‘ఖుషీ’ సినిమా రిలీజైంది. ఏప్రిల్ 8న బన్నీగారి బర్త్‌డే. 7న మేం రిలీజ్ చేయొచ్చు కానీ, రామ్‌చరణ్ గారి సినిమా సమ్మర్లో వస్తుందేమోనని ఏప్రిల్ 27న అని అనౌన్స్ చేశాం. ఇప్పుడు మేం భయపడి వెళ్లినట్లు ఉండకూడదు. బేసిక్‌గా నాకది ఇష్టం లేదు. అవసరం లేదు కూడా. పెద్దలు ఉన్నారు.. చూద్దాం ఏం జరుగుతుందో? ‘ఈగ’, ‘జులాయి’ చిత్రాల రిలీజ్ అప్పుడు రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని మేం పోస్ట్‌పోన్ చేసుకున్నాం. అప్పుడు దానయ్యగారే ఒప్పుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణం ఉండాలి. కానీ, ‘నా పేరు సూర్య...’ డేట్ ఆల్రెడీ మేం అనౌన్స్ చేశాం. ఒక్క మాట కూడా చెప్పకుండా దానయ్యగారు అలా చేయడం అన్నది కరెక్ట్ కాదనిపించింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు. -
రెండు రోజుల్లో 8 సార్లు ‘లగాన్’ చూశా
‘‘నెక్ట్స్ నువ్వే’ నా 60వ సినిమా. ‘పైసా’ సినిమా నాకు పర్ఫెక్ట్ బ్రేక్ ఇస్తే, ‘పటాస్’ కమర్షియల్ హిట్ ఇచ్చింది. నేను కమర్షియల్ మ్యూజిక్ పక్కాగా చేస్తానని ‘రాజా ది గ్రేట్’ నిరూపిస్తుంది. దాని తర్వాతి స్థానంలో ‘నెక్ట్స్ నువ్వే’ నిలుస్తుంది’’ అని సంగీత దర్శకుడు సాయికార్తీక్ అన్నారు. ఆది, వైభవీ శాండిల్య, రష్మీ గౌతమ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. యాంకర్, నటుడు ప్రభాకర్ దర్శకత్వంలో వి4 క్రియేషన్స్‌పై ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న విడుదలవుతోంది. సాయికార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు సినిమాకి వెళ్లినప్పుడు పాటల గురించి కాకుండా నేపథ్య సంగీతం ఎలా ఉందని చూసేవాణ్ణి. ఆర్ఆర్ మీద నాకెంత ఆసక్తి అంటే ‘లగాన్’ చిత్రాన్ని రెండు రోజుల్లో 8 సార్లు కంటిన్యూస్‌గా చూశా. మొదటి నుంచీ ప్రభాకర్‌గారు అన్ని శాఖల్లో ఉండటంతో కొత్త డైరెక్టర్ అనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు. కథని బట్టే సంగీతం వస్తుంది. ఒక్కో సంగీత దర్శకుడికి ఒక్కో ఐడెంటిటీ ఉంటుంది’’ అన్నారు. -
ఆదికి జోడిగా మరాఠి భామ
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా చాలా రోజులుగా స్టార్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన ఆది.. ప్రేమకావాలి,లవ్ లీ లాంటి హిట్ సినిమాలో నటించిన స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లతో కెరీర్‌ను ఇబ్బందుల్లో పడేసుకున్న ఆది, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందు రానున్నాడు. బుల్లితెరపై నటుడిగా, దర్శకుడిగా ఆకట్టుకున్న ప్రభాకర్ దర్శకత్వంలో ఆది హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వీ4 మూవీస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఆదికి జోడిగా ఓ మరాఠి భామను ఎంపిక చేశారు. మరాఠితో పాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించిన వైభవీ శాండిల్య, ఆది సరసన హీరోయిన్గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీస్ సంస్థలు సంయుక్తంగా వీ 4 మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. -
సంగీత దర్శకుడిగా శింబు
సంచలన నటుడు శింబు మరో కొత్త అవతారం ఎత్తడానికి సిద్ధం అయ్యారు. కథానాయకుడిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న శింబు కథకుడిగా, దర్శకుడిగా, గాయకుడిగానూ తన సత్తా చాటుకున్నారు. ఆ మధ్య బీప్ సాంగ్‌తో వివాదాలకు కారణమై, కేసులు, కోర్టుల వరకూ వెళ్లిన శింబు తాజాగా సంగీత దర్శకుడనే కొత్త హోదాకు రెడీ అయ్యారు. శింబు, సంతానం మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర నటుడైన సంతానంను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత శింబుదే. అదే విధంగా శింబు హీరోగా నటించిన విన్నైతాండి వరువాయా చిత్రంతో హస్యనటుడుగా ప్రాచుర్యం పొందిన వీటీవీ గణేశ్‌కు ఆయనంటే ప్రత్యేక అభిమానం. సంతానం కథానాయకుడిగా వీటీవీ.గణేశ్ నిర్మిస్తున్న చిత్రం చక్కపోడు పోడు రాజా చిత్రం ద్వారా శింబు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సర్వర్ సుందరం చిత్రం ఫేమ్ వైభవి శాండిల్య నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి సేతురామన్ దర్శకుడు. తాను సంగీత దర్శకుడిగా అవతారమెత్తడం గురించి శింబు స్పందిస్తూ ఆ చిత్ర దర్శక, నిర్మాతలు సంగీతాన్ని అందించమని కోరారని, కథ విన్న తాను నచ్చడంతో సంగీతాన్ని అందించడానికి అంగీకరించానని తెలిపారు. తనకు సంగీతం అంటే ఆసక్తి అధికం అన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అందువల్ల సంగీత దర్శకుడిగా అవతారమెత్తినట్లు చెప్పారు. తాను మంచి సంగీతాన్ని అందించడానికి కృషి చేస్తానని, దాన్ని ఎలా ఆదరిస్తారన్నది ప్రేక్షకుల చేతిలో ఉంటుందని శింబు పేర్కొన్నారు. ఆయన ఇప్పుడు త్రిపాత్రాభినయం చేస్తున్న అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. -
సంతానంకు జంటగా వైభవి శాండిల్య
హాస్య నటుడి నుంచి కథానాయకుడి స్థాయికి ఎదిగిన నటుడు సంతానం. ఇప్పటి తన స్థాయిని నిలబెట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఈయన చిత్రాల ఎంపికలో ఆచీతూచీ అడుగేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం సంతానం దిల్లుక్కు దుడ్డు, సర్వర్ సుందరం చిత్రాల్లో నటిస్తున్నారు. దిల్లుక్కుదుడ్డు చిత్రంలో తన ఆస్థాన హీరోయిన్గా ప్రచారంలో ఉన్న ఆస్నా జవేరి నటిస్తుండగా, సర్వర్‌సందరం చిత్రంలో మరాఠి బ్యూటీ వైభవి శాండిల్యను హీరోయిన్గా ఎంపిక చేశారు. కెనన్యా ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాల్కీ దర్శకత్వం వహిస్తున్నారు. వైభవి శాండిల్యను ఎంపిక చేయడం గురించి చిత్రం యూనిట్ పేర్కొంటూ మహారాష్ట్ర కోలీవుడ్‌కు చాలా మంది ప్రతిభావంతుల్ని అందించిందన్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి తాజాగా పరిచయం అవుతున్న వైభవి శాండిల్య కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. మూడు నెలల అన్వేషణ ఫలం వైభవి శాండిల్య అని అన్నారు. ఇన్ని రోజులు వేచి ఉన్నందుకు మంచే జరిగిందన్నారు. వైభవి సౌందర్యవతి మాత్రమే కాకుండా మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని తెలిపారు. అంతేకాదు భరతనాట్యం, కథాకళి నృత్యాల్లో నైపుణ్యం పొందిన నటి అని చెప్పారు.అలాంటి నటిని సర్వర్ సుందరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేయడానికి సంతోషిస్తున్నామన్నారు. వైభవి శాండిల్యకు ఇక్కడ మంచి భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు.