ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!! | Aadi to wed on December 13 | Sakshi
Sakshi News home page

ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!!

Published Mon, Oct 6 2014 11:51 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!! - Sakshi

ఆది పెళ్లి ముహూర్తం కుదిరింది!!

డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు, టాలీవుడ్ హీరో ఆది డిసెంబర్ 13న పెళ్లి చేసుకోబోతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అరుణతో విజయదశమి రోజు నిశ్చితార్థం చేసుకున్న ఆది పెళ్లి ముహూర్తాన్ని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. నిశ్చితార్థం చాలా నిరాడంబరంగా జరిగిందని, పరిశ్రమకు చెందిన తన స్నేహితులను కూడా తాను ఎంగేజిమెంటుకు పిలవలేదని ఆది చెప్పాడు.

డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్లోనే తన పెళ్లి జరగనుందని, దానికి మాత్రం దాదాపు ప్రతి ఒక్కరినీ తాను ఆహ్వానిస్తానని తెలిపాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అరుణ తల్లిదండ్రులిద్దరూ న్యాయవాదులేనని ఆది అన్నాడు. తన అక్కడ అత్తమామల ద్వారా ఈ సంబంధం వచ్చిందని వివరించాడు. దాంతో ఆది ప్రేమ వివాహం చేసుకుంటున్నాడన్న కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఆది నటించిన 'రఫ్' సినిమా విడుదల కావాల్సి ఉంది. 'ప్రేమకావాలి'తో తెరంగేట్రం చేసిన ఆది.. ఇటీవలే 'గాలిపటం' సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఉత్సాహం మీద ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement