డిఫరెంట్ జోనర్ మూవీస్‌లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకంటూ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు హీరో ఆది సాయికుమార్. ఇప్పుడు ఆది కథానాయకుడిగా నాటకం ఫేమ్ కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. విజన్ సినిమా బ్యానర్ ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆదివారం(ఆగస్ట్ 15) రోజున టి.ఎం.కె(TMK) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment