మరో విభిన్నపాత్రలో సునీల్‌.. పోస్టర్‌ రిలీజ్‌.. | Sunil First Look Poster From Tees Maar Khan Movie | Sakshi
Sakshi News home page

Sunil: మరో విభిన్నపాత్రలో సునీల్‌.. పోస్టర్‌ రిలీజ్‌..

Published Sat, Jul 30 2022 5:23 PM | Last Updated on Sat, Jul 30 2022 5:27 PM

Sunil First Look Poster From Tees Maar Khan Movie - Sakshi

Sunil First Look Poster From Tees Maar Khan Movie: కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్‌లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్‌డేట్‌ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. సునీల్ ఈ చిత్రంలో 'చక్రి' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సునీల్ సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. 

చదవండి: దుస్తులు లేకుండా రణ్‌వీర్‌ సింగ్‌.. ‍అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కపూర్‌

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement