new role
-
జాలరి పాత్రలో చైతూ.. మత్స్యకారులతో కలిసి!
‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాకుళం, గుజరాత్ నేపథ్యంలోని మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఈ సినిమా కథ ఉంటుందట. ఇందులో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు వైజాగ్ వెళ్లారు నాగచైతన్య, చందు మొండేటి, ‘బన్నీ’ వాసు. మూడు రోజుల ΄ాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అలాగే సముద్ర యానం కూడా చేయాలను కుంటున్నారు. ఇక ఈ మూవీకి ‘తండెల్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్ అని పిలుస్తారట. -
మరో విభిన్నపాత్రలో సునీల్.. పోస్టర్ రిలీజ్..
Sunil First Look Poster From Tees Maar Khan Movie: కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లవ్లీ హీరో ఆది సాయికుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రం రానున్న విషయం తెలిసిందే. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'నాటకం' వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇది వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. వాటికి అన్ని వైపుల నుంచి పాజిటివ్ వైబ్స్ రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. సునీల్ ఈ చిత్రంలో 'చక్రి' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో సునీల్ సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. చదవండి: దుస్తులు లేకుండా రణ్వీర్ సింగ్.. అది సరైన పద్ధతి కాదన్న జాన్వీ కపూర్ ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు. స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు. -
దుల్కర్ సల్మాన్ సినిమాలో సుమంత్ ప్రత్యేక పాత్ర!
మామూలుగా హీరోకి దీటైన విలన్ అంటారు కదా.. హీరోకి దీటైన హీరో అన్నారేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సుమంత్ ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారట. హీరోగా పాతిక సినిమాలకు పైగా చేసిన సుమంత్ ప్రత్యేక పాత్ర చేయడమేంటీ అనుకోవచ్చు. ఇది హీరోకి దీటుగా నిలిచే మరో హీరో పాత్ర కావడంతో ఒప్పుకున్నారట. 1964 బ్యాక్‌డ్రాప్‌లో ప్రియాంకా దత్, స్వప్నా దత్ నిర్మిస్తున్న ఈ బహు భాషా చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు సుమంత్ హీరోగా నటించిన ‘అనగనగా ఒక రౌడీ’ విడుదలకు సిద్ధమైంది. -
డైరెక్టర్ సుకుమార్ కీలక నిర్ణయం.. భార్యకు కొత్త బాధ్యతలు
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ 'సుకుమార్ రైటింగ్స్'లో సినిమాలు తెరకెక్కిస్తున విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి సుకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్ బాధ్యతలు తన భార్య తబితకు అప్పగించినట్లుగా సమాచారం. ఇది వరకు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌కు సంబంధించిన విషయాలన్నీ ఆయన స్నేహితుడు, మేనెజర్ ప్రసాద్ చూసుకునేవారు. అయితే కొద్ది రోజలు క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ బాధ్యతల్ని ఇప్పుడు భార్య తబితకు సుకుమార్ అప్పగించినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఆయన సూచనలతో తబిత కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్‌తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ నిఖిల్‌తో 18 పేజెస్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. చదవండి : హీరో తరుణ్‌తో ‘పుష్ప’ మూవీ టీం చర్చలు! బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘పుష్ప’ -
'సీడీఎస్‌గా భవిష్యత్ వ్యూహాలు రచిస్తా: బిపిన్ రావత్'
న్యూఢిల్లీ: దేశ తొలి త్రివిధ దళాధిపతిగా జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. జనరల్ బిపిన్ రావత్‌ను సీడీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీడీఎస్ హోదాలో ఆయన కొత్తగా ఏర్పాటయ్యే సైనిక వ్యవహారాల విభాగానికీ నాయకత్వం వహిస్తారు. అంతకుముందు ఆయన ఆర్మీ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు. సీడీఎస్‌గా నియమితులైన బిపిన్ రావత్ సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పదవితో తనపై మరిన్ని బాధ్యతలు పెరిగాయని అన్నారు. 28వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న నవరాణేకు రావత్ అభినందనలు తెలిపారు. కాగా, రావత్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. చదవండి: సీఏఏకు తొలి షాక్.. కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రస్తుతం ఆయన స్థానంలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నవరాణే బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్, చైనా సరిహద్దుల వద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని బిపిన్ తెలిపారు. ఇవాళే ఆర్మీ చీఫ్‌గా రిటైర్ అయ్యాను, ఆర్మీ చీఫ్‌గా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఇన్నాళ్లూ వాటిమీదే దృష్టి పెట్టాను. అయితే సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన పాత్రపై కొత్త వ్యూహాన్ని రచించనున్నట్లు ఆయన తెలిపారు. 1978 డిసెంబర్లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి నేటి వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కేంద్రం సీడీఎస్ పదవిని సృష్టించేందుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల సీడీఎస్ పదవికి ఆమోదం తెలిపింది. త్రివిధ దళాలకు సంబంధించిన అన్ని అంశాలపై రక్షణ మంత్రికి ఏకైక సలహాదారుగా సీడీఎస్ వ్యవహరిస్తారు. చదవండి: '3కోట్ల మంది కస్టమర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా' -
సరికొత్త పాత్రలో ఓంపురి
న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంగా తీయబోయే 'ప్రాజెక్ట్ మరఠ్వాడ'లో ప్రముఖ నటుడు ఓంపురి కీలకపాత్ర పోషించనున్నారు. ప్రభుత్వ సహాయాన్ని ఆశించి తన గ్రామం నుంచి ఎంతో ఆశగా ముంబై చేరిన రైతుకు... అక్కడి అవినీతి అధికారుల నుంచి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడన్నది ఈ సినిమా కథాంశం. ఈ సరికొత్త పాత్ర 'ప్రాజెక్ట్ మరఠ్వాడ'పై ఓంపురి మాట్లాడుతూ... ఈ చిత్రం ప్రభుత్వాలు రైతులకు ఏ మాత్రం చేయూత అందించకున్నా... వారు మాత్రం మన కోసం ఎంతో శ్రమిస్తారు. మరఠ్వాడకి చెందిన రైతు తుకారాం(ఓంపురి) ఎదుర్కొన్న సమస్యల్ని తెరపై చూడవచ్చు. "నిత్యం పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కీలకపాత్రలో ఓంపురి కనిపిస్తారు. నాపై నమ్మకం ఉంచిన నటీనటులు, నిర్మాత సత్యవ్రత్ త్రిపాఠికి కృతజ్క్షతలు" అని చిత్ర దర్శకుడు భావిన్ వాడియా తెలిపారు. ఈ నెల 20 తేదీ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. -
కొత్త రోల్లో శ్వేతాబసుప్రసాద్!