Sumanth To Play Key Role In Dulquer Salmaan Film- Sakshi
Sakshi News home page

Hero Sumanth: హీరోకి దీటైన హీరో!

Published Tue, Jul 13 2021 11:53 PM | Last Updated on Wed, Jul 14 2021 12:56 PM

Sumanth New Role In Dulquer Salmaan Film - Sakshi

సుమంత్‌ 

మామూలుగా హీరోకి దీటైన విలన్‌ అంటారు కదా.. హీరోకి దీటైన హీరో అన్నారేంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో సుమంత్‌ ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారట. హీరోగా పాతిక సినిమాలకు పైగా చేసిన సుమంత్‌ ప్రత్యేక పాత్ర చేయడమేంటీ అనుకోవచ్చు.

ఇది హీరోకి దీటుగా నిలిచే మరో హీరో పాత్ర కావడంతో ఒప్పుకున్నారట. 1964 బ్యాక్‌డ్రాప్‌లో ప్రియాంకా దత్, స్వప్నా దత్‌ నిర్మిస్తున్న ఈ బహు భాషా చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. మరోవైపు సుమంత్‌ హీరోగా నటించిన ‘అనగనగా ఒక రౌడీ’ విడుదలకు సిద్ధమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement