జాలరి పాత్రలో చైతూ.. మత్స్యకారులతో కలిసి! | Naga Chaitanya meets fishemens, went to vizag | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: జాలరి పాత్రలో చైతూ.. మత్స్యకారులతో కలిసి!

Published Thu, Aug 3 2023 5:54 AM | Last Updated on Thu, Aug 3 2023 6:45 AM

Naga Chaitanya meets fishemens, went to vizag - Sakshi

‘ప్రేమమ్, సవ్యసాచి’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగచైతన్య, డైరెక్టర్‌ చందు మొండేటి కాంబినేషన్‌లో మూడో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. శ్రీకాకుళం, గుజరాత్‌ నేపథ్యంలోని మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఈ సినిమా కథ ఉంటుందట.

ఇందులో చైతన్య మత్స్యకారుడిగా కనిపించనున్నారని సమాచారం. అందుకే మత్స్యకారులను స్వయంగా కలిసి వారి జీవిత విశేషాలను తెలుసుకునేందుకు వైజాగ్‌ వెళ్లారు నాగచైతన్య, చందు మొండేటి, ‘బన్నీ’ వాసు. మూడు రోజుల ΄ాటు అక్కడే ఉండి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. అలాగే సముద్ర యానం కూడా చేయాలను కుంటున్నారు. ఇక ఈ మూవీకి ‘తండెల్‌’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు టాక్‌. శ్రీకాకుళంలో మత్స్యకారులను తండెల్‌ అని పిలుస్తారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement